“గుప్పెడంత మనసు” సీరియల్ లో ఇలా జరిగింది ఏంటి..? అసలు శైలేంద్ర ఇలా ఎందుకు చేశాడు..?

Ads

గత కొద్ది రోజుల నుండి ఆసక్తికరంగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో శైలేంద్ర కుట్రలకు సంబంధించిన ఆడియో టేప్ విన్న రిషికి క్లారిటీ వస్తుంది. అంతలో శైలేంద్ర పై అటాక్ జరగడంతో హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు.

Ads

రిషి కనిపించకుండా పోవడంతో అందరు ఆందోళన పడుతుంటారు. అయితే రిషి మిస్సింగ్‌ విషయంలో  శైలేంద్ర అనుమానాస్పదంగా మాట్లాడంతో నేటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అనుపమ మహేంద్రకు కాల్  చేసి, హస్పటల్ లో ఉన్నవట, ఏమైంది అని అడుగుతుంది. మహేంద్ర సరిగా మాట్లాడకపోవడంతో అడుగుతూనే ఉంటుంది. దాంతో శైలేంద్ర పై ఎవరో అటాక్ చేశారు. ఎవరనే విషయం తెలియదు. ఇంతకన్నా ఆడగవద్దు, మళ్లీ ఫోన్ చేయకు, జగతి కేస్ చూస్తున్న ముకుల్  శైలేంద్రని విచారించి, వెళ్లారు. మిగతా విషయాలు వాళ్లు చూసుకుంటారు. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. మహేంద్ర మాటలతో అనుపమ షాక్ అయ్యి, ఆలోచిస్తూ ఉంటుంది. శైలేంద్ర పై అటాక్ ఏంటీ? జగతి కేసు ఏమైందో తెలుసుకోవాలని భావిస్తుంది.
మరో వైపు శైలేంద్ర వద్దకు దేవయాని వెళ్తుంది. అతను నిద్రపోవడం చూసి వెళ్తుంటే, శైలేంద్ర నిద్రపోవడం లేదు. నటిస్తున్నా అని చెప్తాడు. ఇలా గాయాలతో నిన్ను చూసి చాలా బాధపడ్డాను అని దేవయాని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కంగారూ పడకు, ఎవరి విషయంలో భయపడకు మామ్, ధైర్యంగా ఉండు, ఎలా అయినా నువ్వు కోరుకున్నట్లుగానే ఎండీ సీట్‌లో కూర్చుంటానని శైలేంద్ర అంటాడు. రిషి కనిపించడం లేదని చెప్తుంది. అప్పుడు శైలేంద్ర అనుమానాస్పదంగా మాట్లాడుతాడు. దేవయాని నీ పై అటాక్ చేసింది ఎవరని అడగుతుంది. అతడి పేరు శైలేంద్ర అని చెప్పడంతో దేవయాని షాక్ అవుతుంది. తన పై తానే అటాక్ చేయించుకున్నట్టుగా చెప్తాడు.
ఆ తరువాత అనుపమ ముకుల్‌ ని కలిసి జగతి కేసు గురించి, శైలేంద్ర పై అటాక్ ఎవరు చేశారని అడుగుతుంది. అనుపమ తనను జర్నలిస్ట్‌ గా పరిచయం చేసుకుంటుంది. మహేంద్ర ఫ్యామిలీకి కావాల్సినదాన్ని అని చెబుతుంది. ముకుల్ వెంటనే మహేంద్రకు ఫోన్ చేసి, స్పీకర్‌ ఆన్ చేసి మాట్లాడతాడు. సార్ అనుపమ గారని ఒకరు శైలేంద్ర పై జరిగిన దాడి గురించి అడుగుతున్నారు. చెప్పమంటారా అని అంటాడు. మహేంద్ర అనుపమ మా ఫ్యామిలీకి చాలా కావాల్సిన వ్యక్తి. కానీ, ఆమెకు ఏ విషయాల గురించి చెపొద్దు. అలాగే తనని ఇంకోసారి కలవద్దు. అలా చేయడం  తనకు ఇష్టం లేదు అని కాల్ కట్ చేస్తాడు. దాంతో ఇటు అనుపమ, అటు మహేంద్ర ఇద్దరు బాధపడుతారు.

Also Read: SALAAR Vs DUNKI… 2 టైలర్స్ కి రెస్పాన్స్ ఒకటే..! కానీ ప్రేక్షకులకి ఏది ఎక్కువ నచ్చింది అంటే..?

Previous articleCyclone Michaung: అసలు చెన్నైలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉంది..?
Next articleఈ నటుడు తెలియని తెలుగు వారు లేరు ఏమో..! ఈయన చనిపోవడానికి కారణం ఇదేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.