Ads
నందమూరి తారక రామారావు, బాలకృష్ణల తరువాత జూనియర్ ఎన్టీఆర్ మూడో తరం నటుడిగా చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి,సెన్సేషన్ గా మారాడు. అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్స్,సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన స్టామినాను రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఎవరి సహాయం లేకుండా తన కష్టంతోనే పైకొచ్చాడు. ఆయనకి కుటుంబం సపోర్ట్ ఏ మాత్రం లేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ వీటిపై అప్పట్లో జరిగిన ఒక మూవీ ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చారు. హరికృష్ణ ఏం చెప్పారో చూద్దాం..
హరికృష్ణ సీతా రామ రాజు, శ్రీరాములయ్య, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. శివ రామ రాజు సినిమాలో జగపతి బాబు, శివాజీ, వెంకట్, లయ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి వి. సముద్ర దర్శకుడు. ఈ సినిమాలో ఆనంద భూపతి రాజుగా కీలక పాత్రలో హరికృష్ణ నటించారు. అయితే ఈ సినిమా ఆడియో ఈవెంట్ వేదిక పై హరికృష్ణ పర్సనల్ విషయాలు చెప్పడానికి ఆ మూవీ దర్శక నిర్మాతలను అనుమతి అడిగి ఎన్టీఆర్ గురించిన రూమర్స్ పై మాట్లాడారు.
Ads
ఎన్టీఆర్ ని మా కుటుంబం పట్టించుకోవట్లేదని, అతన్ని ఒంటరిని చేసామని రూమర్స్ సృష్టించారు. అవన్నీ అబద్దాలే, మా తండ్రి రామారావు గారిని ఎవరు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, ఎవరు ఆయన్ను నడిపించారు. ఎవరైనా సరే స్వశక్తితో ఎదగాలి. ఆయన ఒంటరిగా వచ్చి, ఒంటరిగా పోరాటం చేసారు. నా తమ్ముడు బాలకృష్ణ హీరోగా ఎలా ఎదిగాడు. మా తండ్రి గారు ఏరోజు అయిన నా కుమారున్ని పైకి తీసుకురావాలని తెలుగు ప్రజలను అడిగారా, ఇక నా సంగతి తీసుకుంటే నేను మా నాన్నకు డ్రైవర్‌గా పని చేసాను.అదే కాకుండా మా ప్రొడక్షన్ లో తీసిన సినిమాలకు నిర్మాతగా ఉన్నా ఛీఫ్ కంట్రోలర్‌గా చేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చాను. అలాగే ఎవరికి కోసం వారే పైకి రావడానికి ప్రయత్నించాలి. అంతేకాని పక్కన ఉండి సలహాలిస్తూ ఉంటే ఎవరు ఎప్పుడూ ఎదగలేరు. ఎన్టీఆర్ సొంతంగా ఎదుగుతుంటే చూస్తూ తండ్రిగా గొప్ప ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ స్టోరీ మాత్రమే విన్నాను. ఆ తరువాత తానే ఎంచుకున్నాడు. తనకు సొంత నిర్ణయాలు తీసుకోవాలనే అలా చేశానంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఆ మూవీ కోసం బాలకృష్ణకు NTR పెట్టిన 3 షరతులు ఏమిటో తెలుసా?