జక్కన్న ఇచ్చిన హింట్ ను మనమే గుర్తు పట్టలేదు.. ఆ హింట్ ఏమిటో తెలుసా?

Ads

దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబ‌లి సినిమా ఎంతటి సంచ‌ల‌న విజయం పొందిందో అందరికి తెల్సిందే. ప్ర‌భాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. బాహుబ‌లి మూవీని రాజమౌళి రెండు పార్ట్ లుగా రూపొందించాడు.

Ads

ఈ బ్లాక్ బస్టర్ మూవీలో అనుష్క‌, తమ‌న్నాలు హీరోయిన్ లుగా న‌టించారు. విల‌న్ గా దగ్గుబాటి రానా నటించాడు. భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అయిన బాహుబ‌లి మొదటి పార్ట్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్ తరువాత పార్ట్ 2 పై ఇంకా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ మూవీ విడుదలైన తరువాత అంద‌రిలోనూ ఒకటే ప్రశ్న మొద‌లైంది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అని ప్ర‌శ్న.బాహుబలి కంక్లూజన్ విడుదలయ్యే వరకు ఆ ప్రశ్న ఫ్యాన్స్ నుండి మొదలు పెడితే సెలబ్రెటీస్ వరకు అడుగుతూనే ఉన్నారు. అంతలా బజ్ క్రియేట్ చేశారు జక్కన్న.ఇక పార్ట్ 2 సినిమాలో ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది. బాహుబలి 2 కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల వసూళ్లు వ‌చ్చాయి. ఈ క్రమంలోనే ప్రేక్ష‌కులు బాహుబ‌లి పార్ట్ 3 ఉంటే బాగుంటుంద‌ని అనుకున్నారు. అయితే ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇంట‌ర్వ్యూలో బాహుబ‌లి పార్ట్ 3 ఉంటుంద‌ని తెలిపారు. కానీ అది రావడానికి ఇంకా స‌మ‌యం ఉందని చెప్పారు. ప్రస్తుతం బాహుబ‌లి 3 పై సోషల్ మీడియాలో చ‌ర్చ స్టార్ట్ అయ్యింది.లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న మూవీ మార‌థాన్ ఈవెంట్లో జక్కన్న మూవీస్ ను కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజ‌మౌళి అక్కడ జరిగే క్యూ అండ్ ఏ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అందులో రాజమౌళికి బాహుబ‌లి 3 సినిమా పై ప్ర‌శ్న‌లు అడిగారు. ఆయ‌న దానికి నేను తీసిన మూవీస్ లో ఒక్క మూవీ క్లైమాక్స్ లోనే సంభాష‌ణ‌ను పెట్టిన‌ట్టు చెప్పారు.ఇక బాహుబ‌లి మూవీ క్లైమాక్స్ లోనే సంభాష‌ణ‌ ఉంటుంది. దానిలో త‌నికెళ్ల భ‌ర‌ణి చిన్నారి మ‌ధ్య సంభాష‌ణ‌ జ‌రుగుతుంది. అయితే ఆ చిన్నారి త‌నికెళ్ల భ‌ర‌ణిని మ‌హేంద్ర బాహుబ‌లి కొడుకు ఆ తరువాత రాజు అయ్యాడా తాతా అని అడిగితే, త‌నికెళ్ల‌భ‌ర‌ణి శివయ్య మ‌న‌సులో ఏముందో నాకేటి ఎరుక‌ అని చెప్తాడు.ఈ వీడియో ని ఓ నెటిజ‌న్ షేర్ చేసి బాహుబ‌లి -3 కమింగ్ సూన్ అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

Also Read: బాలకృష్ణ చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసాడు?

Previous articleపవన్ హీరోయిన్ ‘లవ్ లీ’.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Next articleహరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదటిసారి పబ్లిక్‌లో ఏమన్నారంటే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.