కాంతార సినిమాకి సాయి ధరమ్ తేజ్ ”విరూపాక్ష” సినిమాకి మధ్య లింక్ ఏమిటి..?

Ads

కన్నడ సినిమా కాంతార ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులని ఎంత గానో ఆకట్టుకుంది. కాంతార కథ చాలా సింపుల్ గా వుంది. అయినా సరే ఈ సినిమా అందరినీ ఇంప్రెస్ చేసేసింది. కొన్ని సినిమాలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హిట్ అయ్యిపోతు ఉంటాయి. చాలా చిన్న సినిమాలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హిట్ అయ్యాయి. అలానే కన్నడ సినిమా కాంతార కూడా.

నేపథ్యం, కథనం చాలా బాగుంది. అలానే ఇందులో చూపించిన ఆచార సంప్రాదాయాలు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. పైగా ఈ సినిమా లో రాజ కుటుంబీకులు భూములు వంటివి అద్భుతంగా చూపించారు.

Ads

క్షేత్ర పాలకుడు ఉండడం, కోలం ఇవన్నీ కూడా దర్శకుడైన రిషభ్ శెట్టి చాలా చక్కగా తెర మీద కి తీసుకు రావడం జరిగింది. హీరోగా రిషభ్ శెట్టి బాగా ఆకట్టుకున్నాడు. నటన చాలా బాగుంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం లో విరూపాక్ష సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా కాంతార లాంటి కాన్సెప్ట్ తోనే రాబోతోంది. ముగ్గురు భాగస్వాముల నిర్మాణంలో ఈ సినిమా రానుంది.

ఎక్కువే బడ్జెట్ తో ఈ మూవీ ని తీసుకు వస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ జానర్ ఇది. కథ చాలా కొత్తగా ఉంటుందిట. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకుడు కావడం తో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగానే వున్నాయి. ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో పెద్ద హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సాయి ధరమ్ తేజ్ సొంత బ్యానర్ మీద ఈ సినిమా తెర మీద కి వస్తోంది. ఈ సినిమా మూవీ గ్లిమ్ప్స్ కూడా వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Previous articleహరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదటిసారి పబ్లిక్‌లో ఏమన్నారంటే..!
Next article‘హిట్2’ వరకు తెలుగులో రూపొందిన 10 సైకో కిల్లర్ సినిమాల లిస్ట్..!