డెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన.. హీరో హీరోయిన్లు వీళ్ళే..!

Ads

చాలా మంది హీరోలు హిట్లు కొట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వరుసగా ప్లాప్స్ కూడా వస్తూ ఉంటాయి. సినిమా మీద ఆశలు పెట్టుకుని చిత్ర యూనిట్ సినిమాని రిలీజ్ చేస్తుంది. పక్కా హిట్ అవుతుందని సినిమాని రిలీజ్ చేస్తారు కానీ అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయి. సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది.

ఎన్నో ఏళ్ళు హిట్ల కోసం ఎదురుచూసిన హీరోలూ ఉన్నారు అయితే డెబ్యూ మూవీ తోనే ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి మొదటి సినిమాతోనే ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టేసిన హీరో హీరోయిన్ల గురించి ఇప్పుడు చూసేద్దాం.

#1. అల్లు అర్జున్, అదితి అగర్వాల్:

అల్లు అర్జున్ అదితి అగర్వాల్ డెబ్యూ ఇచ్చిన గంగోత్రి సినిమా మంచి హిట్ ని ఇచ్చింది కే రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

#2. నితిన్, సదా:

జయం సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు నితిన్, సదా ఈ సినిమా కూడా హిట్ అయింది.

#3. ఉదయ్ కిరణ్, రీమాసేన్:

చిత్రం కూడా చక్కటి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు.

#4. తరుణ్, రీచా:

నువ్వే కావాలి సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు తరుణ్ రీచా. కే విజయభాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Ads

#5. రామ్ చరణ్, నేహా శర్మ:

రామ్ చరణ్ నేహా శర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిరుత సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది.

#6. యశోసాగర్, స్నేహ ఉల్లాల్:

యశోసాగర్ స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా కూడా హిట్ అయ్యింది.

#7. రామ్, ఇలియానా:

దేవదాస్ సినిమాతో రామ్ ఇలియానా ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని కొట్టేశారు.

#8. శ్రీనివాస్, రేష్మ:

ఈరోజుల్లో సినిమాతో శ్రీనివాస రేష్మ కూడా హిట్ అందుకున్నారు.

#9. నాగశౌర్య, రాశీ ఖన్నా:

ఊహలు గుసగుసలాడే సినిమాతో నాగశౌర్య రాశీ ఖన్నా పరిచయం అయ్యారు. ఈ సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది.

#10. రాజ్ తరుణ్, అవికా గోర్:

ఉయ్యాల జంపాల సినిమా తో పరిచయమయ్యారు రాజ్ తరుణ్ అవికా గోర్ ఈ సినిమా కూడా హిట్ అయింది.

#11. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి:

ఉప్పెన సినిమాతో వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చారు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Previous articleరికార్డ్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ సినిమాతో రాబట్టిన.. 10 హీరోలు వీళ్ళే..!
Next articleసినీ పరిశ్రమ కి చేయూత నివ్వనున్న కాంగ్రెస్ !