Ads
టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోలు ఏడాదికి ఒక మూవీ విడుదల చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, శంకర్ లాంటి వాళ్ళు రెండు మూడు సంవత్సరాలకు ఒక మూవీ తీస్తున్నారు.
Ads
కానీ గతంలో హీరోలు సంవత్సరానికి పదిహేను చిత్రాలకు పైగా రిలీజ్ చేసి రికార్డులు సృష్టించారు. అప్పట్లో ఒక సంవత్సరంలో ఏ హీరోలు ఎన్ని సినిమాలు విడుదల చేశారో, ఇక ఏడాదిలో ఎక్కువ మూవీస్ విడుదల చేసిన హీరోలు ఎవరో చూద్దాం..
1. సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ 5 దశాబ్దాల తన కెరీర్ లో 350కి పైగా చిత్రాలలో నటించారు. 1970లో సూపర్ స్టార్ కృష్ణ ఒకేసారి పదహారు చిత్రాలలో నటించారు. ఆ ఏడాదిలో 11 చిత్రాలు రీలీజ్ అయ్యాయి. ఇక 1972లో కృష్ణ హీరోగా నటించిన సినిమాలు ఏకంగా 18 విడుదలయ్యాయి. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
2.ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు హీరోగా నటించిన 17 చిత్రాలు 1964లో రీలీజ్ అయ్యాయి.
3. రెబల్ స్టార్ కృష్ణంరాజు
కృష్ణంరాజు 17 సినిమాలతో 1974 లో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక అన్ని సినిమాలూ విజయం సాధించాయి.
4.రాజేంద్ర ప్రసాద్
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ 300లకు పైగా చిత్రాలలో నటించారు.1988 సంవత్సరంలో 17 సినిమాలను విడుదల చేశారు.
5.మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 1980లో 14 రిలీజ్ అయ్యాయి.
6.శోభన్ బాబు
శోభన్ బాబు తన కెరీర్ 230 చిత్రాలలో నటించారు. 1980 లో శోభన్ బాబు నటించిన 12 మూవీస్ విడుదల అయ్యాయి.
7.అక్కినేని నాగేశ్వరావు
అక్కినేని నాగేశ్వరావు అయితే 1960, 1971, 1984లలో 9 మూవీస్ విడుదల అయ్యాయి.
8.శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ 1998లో 10 మూవీస్ హీరోగా నటించి, విడుదల చేసారు.
9.బాలకృష్ణ
నట సింహం బాలకృష్ణ కూడా 1987లో ఏడు మూవీస్ విడుదల అయ్యాయి.10.జగపతి బాబు
జగపతి బాబు హీరోగా ఉన్న టైంలో ఒకే ఏడాదిలో ఆరు చిత్రాలను, చాలా సంవత్సరాల పాటు విడుదల చేశాడు.
Also Read: రెండు పెళ్లిళ్లు చేసుకున్న సినీ నటులు ఎవరో తెలుసా?