రెండు పెళ్లిళ్లు చేసుకున్న సినీ నటులు ఎవరో తెలుసా?

Ads

సినీతారలు సినిమాల్లో నటిస్తూ పాపులారిటీని కూడా సంపాదించుకుంటారు. సినిమాల్లో ఉన్నట్లే వల్ల జీవితాల్లో కూడా అనుబంధాలు,ప్రేమతో తమ కుటుంబాలను చూసుకుంటున్నారు. అయితే వీరిలో కొందరు నటీనటులు వారి జీవితాలను క్రమశిక్షణతో ఉన్నారు.

ఇంకొందరు స్టార్ స్టేటస్ తో వచ్చిన డబ్బుతో జీవితాలను పోగొట్టుకున్నవారు ఉన్నారు. మరికొందరు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో రోమాన్స్ చేసినట్టుగా, నిజ జీవితంలోనూ రెండు, మూడు వివాహాలు చేసుకున్నారు. ఇక అలా పెళ్ళిళ్ళు చేసుకున్న స్టార్స్ ఎవరో చూద్దాం..
1.ఎన్టీఆర్:
టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరో నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ మేనమామ కూతురు బసవతారకాన్ని 1942లో పెళ్లి చేసుకున్నారు. ఆమె క్యాన్సర్‌తో చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని 1993లో రెండో వివాహం చేసుకున్నారు.2.సూపర్ స్టార్ కృష్ణ:
టాలీవుడ్ లో జేమ్స్‌బాండ్, కౌబాయ్ మూవీస్ తో సెన్సేషన్ సృష్టించిన కృష్ణ రెండు వివాహాలు చేసుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు మేనమామ కూతురు 1961లో ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న కృష్ణ, 1969లో నటి విజయనిర్మలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.3. నాగార్జున:
కింగ్ నాగార్జున ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకుని, మనస్పర్థలతో విడిపోయారు. తరువాత నటి అమలను ప్రేమించి, పెద్దల అనుమతితో 1992లో రెండో పెళ్లి చేసుకున్నారు.4.నందమూరి హరికృష్ణ:
హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌ బాటలోనే నడిచి రెండు పెళ్లిళ్ల చేసుకున్నాడు. లక్ష్మీని 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసినిలు సంతానం. తరువాత హరికృష్ణ షాలినిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి కుమారుడే జూనియర్ ఎన్టీఆర్.5.పవన్ కల్యాణ్:
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమైన పవన్ కల్యాణ్ తక్కువ టైమ్ లోనే తెలుగులో అగ్రకథానాయకుడిగా మారారు. నందినిని 1997లో పెళ్లి చేసుకున్న పవన్, తరువాత విడిపోయారు. ఆ తరువాత నటి రేణు దేశాయ్‌ ని ప్రేమించి, లాంగ్ డేటింగ్ తరువాత ఆమెను 2009లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పరస్పర అంగీకారంతో విడిపోయారు.ఇక ఆ తరువాత రష్యన్ నటి అన్నా లెజ్‌నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.
6.శరత్ బాబు:
సీనియర్ హీరో శరత్ బాబు రెండు వివాహాలు చేసుకున్నారు. సహ నటి, కమెడియన్ రమాప్రభను 1981లో పెళ్లి చేసుకున్నారు. తరువాత రమాప్రభకు విడాకులు ఇచ్చి, 1990లో స్నేహా నంబియార్‌ను రెండో వివాహం చేసుకున్నారు.ఇక 2011లో ఆమెకు విడాకులిచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు.

Ads

7.కమల్ హాసన్:
ఇండియా గర్వించదగ్గ గొప్ప హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ కూడా 1978లో వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయిన కమల్ సారికను 1988లో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారు మనస్పర్థలతో విడిపోయారు. తరువాత నటి గౌతమితో పదమూడేళ్ళు సహజీవనం చేసిన కమల్ ఆమెతోను విడిపోయారు.
8.రాధిక శరత్ కుమార్:
ప్రముఖ నటి రాధిక ప్రతాప్ పోతన్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆయనతో విడిపోయి, లండన్‌ వాసి అయిన రిచర్డ్ హ్యార్లీని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే విడిపోయి, హీరో శరత్ కుమార్‌ ను ప్రేమించి 2001లో వివాహం చేసుకున్నారు.

9.ప్రకాశ్ రాజ్:
విలక్షణ నటుడుగా పేరు గాంచిన నటుడు ప్రకాశ్ రాజ్. ఈయన మొదట లలితా కుమారిని వివాహం చేసుకుని, 15 ఏళ్ల తరువాత 2009లో ఈ జంట విడిపోయింది. ఇక 2010లో కొరియోగ్రాఫర్ సోనీ వర్మని వివాహం చేసుకున్నాడు.

Also Read: పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..

Previous articleమెగాస్టార్ టు వైష్ణవ్ తేజ్.. హిట్ కోసం వెయిట్ చేస్తున్న 10 టాలీవుడ్ హీరోలు..
Next article‘పుష్ప సీక్వెల్ తో పాటు వచ్చే ఏడాది రాబోతున్న మరిన్ని సీక్వెల్స్!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.