సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ మోహన్‌లాల్‌ సినిమా చూశారా..? దీని కథ ఏంటంటే..?

Ads

మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్‌ తెలుగు వారికి కూడా బాగా తెలిసిన నటులు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఇటీవల మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలైకోటై వాలిబన్‌ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యింది. కొన్ని సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకి నచ్చకపోయినా కూడా ఓటీటీలోకి వచ్చాక నచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా కథ విషయానికి వస్తే, వాలిబన్‌ (మోహన్‌లాల్‌) ఒక మల్ల యోధుడు.

mohanlal malaikottai vaaliban telugu

అతని సోదరుడితో కలిసి ఎన్నో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు. అక్కడ మల్ల యోధులతో పోరాడి, ఎన్నో విజయాలు పొందుతాడు. అన్ని యుద్ధాల్లో పాల్గొనడంతో, అతనికి అభిమానులు ఎంతో మంది ఉంటారు. వారితో పాటు శత్రువులు కూడా ఉంటారు. అయితే, ఒక సంస్థానంలో కొంత మంది ఆంగ్లేయులు బందీగా ఉంటారు. అనుకోకుండా వాలిబన్ సోదరుడు మరణిస్తాడు. అతను ఎలా మరణించాడు? ఆంగ్లేయుల సంస్థానంలో బందీగా ఉన్న భారతీయులని వాలిబన్ కాపాడాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

mohanlal malaikottai vaaliban telugu

Ads

సినిమా ట్రైలర్ చూసిన వారికి, ఇది ఒక పీరియాడికల్ సినిమా అని అర్థం అయిపోయి ఉంటుంది. పగ, ప్రతీకారాలు అనే విషయాల వల్ల ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనేది ఈ సినిమాలో చూపించాలి అనే ప్రయత్నం చేశారు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరీ. ఈ దర్శకుడు తీసిన జల్లికట్టు సినిమా అంతకుముందు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. దానికి ముందు తీసిన అంగామలై డైరీ సినిమా కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

mohanlal malaikottai vaaliban telugu

ఆ సినిమాని తెలుగులో ఫలక్ నామా దాస్ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా టేకింగ్ విషయంలో మాత్రం తడబడ్డారు అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ బాగున్నా కూడా చూపించాల్సిన విధంగా ఈ సినిమాని చూపించలేదు అనిపిస్తుంది. హీరో మోహన్‌లాల్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కానీ మిగిలిన ఏ విషయాల్లో కూడా ఈ సినిమా ఆకట్టుకోలేకపోతుంది. సినిమాలో గట్టి పాయింట్ ఉండదు. ఉన్న వాటిని కూడా బలంగా చూపించలేకపోయారు.

mohanlal malaikottai vaaliban telugu

నటీనటుల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా, రైటింగ్ బలహీనంగా ఉండడం వల్ల అంత గుర్తుండి పోయే అంత గొప్ప పాత్రలుగా అయితే అనిపించవు. ప్రశాంత్ పిళ్ళై అందించిన పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. దీపు జోసెఫ్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ అసలు ఈ సినిమా కథ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి చూసే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

ALSO READ : 5 సంవత్సరాల తర్వాత మళ్లీ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న ఈ యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Previous article“లెజెండ్ శరవణన్” నెక్స్ట్ సినిమాని ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా..? కారణం ఏంటంటే..?
Next articleఏడాదికి 10 సినిమాలకి పైగా విడుద‌ల చేసిన హీరోలు వీరే..!