Ads
ప్లాస్టిక్ స్టూల్స్ ని ఉపయోగించడం ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులకి ప్లాస్టిక్ స్టూల్స్ ఎంతో అనువుగా ఉంటాయి. కుర్చీలని ప్రతి చిన్న పనికి అటు ఇటు తీసుకువెళ్లడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇళ్లల్లో ప్లాస్టిక్ స్టూల్స్ ని వాడుతారు. తేలికగా ఉంటాయి కాబట్టి అటు నుండి ఇటు తీసుకువెళ్లడం కూడా ఈజీగా ఉంటుంది.
అయితే ఏ ప్లాస్టిక్స్ స్టూల్స్ ని చూసిన స్టూల్ మధ్య రంధ్రం ఉంటుంది. అన్ని కంపెనీలు కూడా ఈ విధంగానే స్టూల్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎందుకు ప్లాస్టిక్ స్టూల్స్ మధ్య రంధ్రం ఉంటుంది అని… దాని వెనుక కారణం ఇదే. డిజైన్ కోసమని ఇలా స్టూల్స్ డిజైన్ చేయరు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాస్టిక్ స్టూల్ మధ్యన రంధ్రం ఎందుకు ఉంటుంది..?
గుండ్రంగా ఉండే స్టూల్ కి అయినా స్క్వేర్ ఆకారంలో ఉన్న స్టూల్ కి అయినా సరే మధ్యలో రంధ్రం ఉంటుంది. అయితే మధ్యలో రంద్రం ఉండడం వలన అన్ని సైడ్స్ మీద ప్రెషర్ పడుతుంది. పైగా గుండ్రంగా రంధ్రం ఉంటుంది కాబట్టి ప్రెషర్ అనేది అన్ని వైపులా సరిగ్గా పడుతుంది.
Ads
గుండ్రంగా రంధ్రం ఉండడం వలన స్టూల్స్ విరిగిపోకుండా ఉంటాయి. ఒకదాని మీద ఒక స్టూల్ ని పెట్టిన ఇబ్బంది ఉండదు. ఒక స్టూల్ మీద మరొక స్టోన్ పెడితే విరిగిపోకుండా ఉండడానికి కూడా ఈ రంధ్రం సహాయపడుతుంది.
తక్కువ స్పేస్ లో మనం ఎక్కువ స్కూల్స్ ని పెట్టుకోవచ్చు:
తక్కువ స్పేస్ లో మనం ఎక్కువ స్కూల్స్ ని పెట్టుకోవచ్చు. పైగా మనం తీసుకోవాలనుకునేటప్పుడు ఈజీగా మనం వీటిని తీసుకోవచ్చు. ఒకవేళ కనుక రంధ్రం లేకపోతే ప్రెషర్ మరియు వ్యాక్యూమ్ కారణంగా ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి దీనితో స్టూల్ ని తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ రంధ్రం ఉండడం వలన ఈ బెనిఫిట్ ని కూడా మనం పొందవచ్చు.
సులభంగా తీసుకు వెళ్ళగలం తీయగలం:
మధ్యలో రంధ్రం ఉండడం వలన మనం ఈజీగా స్టూల్ ని తీసుకు వెళ్ళడానికి అవుతుంది అందుకే వీటిని ఈ విధంగా డిజైన్ చేస్తారు.