ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు టీం ఇండియాలో పెద్ద స్టార్…ఎవరో గుర్తుపట్టారా.?

Ads

మనం తరచుగా ఇంటర్నెట్ లో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలను చూస్తూ ఉంటాం. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారివి, రాజకీయాలకు సంబంధించిన వారివి, అలాగే క్రికెటర్ లవి వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఫ్యాన్స్ తాము అభిమానించే వారి చిన్నప్పటి ఫోటోలను చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. కొంతమందికి అయితే ఇది కష్టంగాను అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక స్టార్ క్రికెటర్ ఫోటో వైరల్ అవుతుంది.

అది అతని చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టగలరో లేదో చూడండి. మీకోసం ఒక క్లూ ఇస్తాము… అతన్ని ఇండియాలో హిట్ మాన్ అని పిలుస్తారు. అత్యధిక ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్. వరల్డ్ కప్ లో ఇండియా ని ముందుండి నడిపిస్తున్న సారధి. ఈపాటికి మీరు గెస్ చేసేసి ఉంటారు. ఎస్ మీ గెస్ కరెక్ట్…. మన టీమ్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి ఫోటో ఇది. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా మన హిట్ మాన్.

Ads

రోహిత్ శర్మ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే అతను ఏంటో…అతని టాలెంట్ ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. సాధారణ క్రికెటర్ గా టీమ్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి నేడు వరల్డ్ కప్ లో ఇండియాని నడిపించే కెప్టెన్ గా ఎదిగిన తీరు ఎవరు మర్చిపోరు. వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక డబల్ సెంచరీలు ఉన్న క్రికెటర్. అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ కూడా రోహిత్ శర్మనే.ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ అత్యధిక టైటిల్ ల్లు అందించాడు. తాజగా ఆసియా కప్ గెలిచి ఇండియా ఖాతాలో మరో చిరస్మరణీయ విజయాన్ని చేర్చాడు.ఇప్పుడు మన హిట్ మాన్ కన్ను వరల్డ్ కప్ మీద పడింది. టీమ్ ఇండియాను ఫైనల్స్ కి చేర్చడంలో రోహిత్ శర్మ కృషి ఎంతైనా ఉంది.

టీమ్ ని ఒక తాటిపై నడిపిస్తూ అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఈరోజు ఇండియా ని ఈ స్థాయిలో నిలబెట్టాడు. ఒక్క అడుగు దూరంలో వరల్డ్ కప్ ఇండియా కోసం ఎదురుచూస్తుంది. ఇండియాకి వరల్డ్ కప్ అందించి రోహిత్ తన బాధ్యతను నెరావర్తించాలని ఉవిళ్ళూరుతున్నాడు.ఇక రోహిత్ శర్మ రితికాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరందరికీ ఒక పాప కూడా ఉంది. రోహిత్ శర్మ తల్లికి మన తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. రోహిత తల్లి విశాఖపట్నం కి చెందిన మూలాలు కలిగిన వ్యక్తి. అందుకే రోహిత్ ఎప్పుడు కూడా విశాఖపట్నం తనకు ప్రత్యేకమని చెబుతూ ఉంటాడు. విశాఖలోనే మంచి మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఈ హిట్ మాన్ ఇదే విధంగా మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుందాం..

Previous article“రామ్ చరణ్-ఉపాసన” పెళ్లి పత్రిక చూశారా..? ఇందులో ఏం రాసి ఉందో తెలుసా..?
Next articleఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.