క్రికెటర్ దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, మురళీ విజయ్ భార్యగా ఎలా మారిందంటే..

Ads

ఇండియన్ క్రికెటర్ మరియు వికెట్ కీపర్ అయిన దినేశ్ కార్తీక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రికెటర్ గా ఆయన గురించి అందరికి తెలుసు. కానీ కార్తీక్ పర్సనల్ లైఫ్ లో జరిగిన విషాద ఘటన గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. దినేశ్ కార్తీక్ 2004లో ఇండియన్ టీంలోకి వచ్చాడు.

కార్తీక్ తన ఆటతీరుతో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో కూడా అందరి హృదయాలను గెలుచు కున్నాడు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు అతని జీవితంలో భార్య, స్నేహితుడు చేసిన మోసం వల్ల ఏర్పడిన మార్చవపోలేని గాయం ఉంది. అతని మొదటి భార్య వల్ల మోసపోయి పిచ్చివాడిలా మారిన కార్తీక్ రెండవ భార్య ప్రేమ వల్ల మనిషి అయ్యాడు. దినేశ్ కార్తీక్, మురళీ విజయ్ లు చిన్నతనం నుండి మంచి మిత్రులు. దేశవాళీ టోర్నీల్లో కార్తీక్ చెన్నైకి కెప్టెన్‌గా ఉండేవాడు. 2007 లో కార్తీక్ తన చిన్నప్పటి  స్నేహితురాలు అయిన నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ముంబైలో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు క్రికెటర్‌ అయిన మురళీ విజయ్ హాజరయ్యాడు.
స్నేహితుడు అనే చనువుతో మురళీ విజయ్, కార్తీక్ ఇంటికి తరచూ వెళుతూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్ భార్య అయిన నికితా వంజరతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఈ సంగతి ఒక్క కార్తీక్‌ కు తప్పా చెన్నై క్రికెట్ టీమ్ అందరికి తెలుసు. అలా కొనసాగుతున్న క్రమంలోనే ఒకరోజు నికితా వంజర ఈ విషయాన్ని కార్తీక్‌కు చెప్పి, తాను మురళీ విజయ్ వల్ల గర్భం దాల్చినట్లు తెలిపింది. అంతే కాకుండా విడాకులు కావాలని అడిగింది. ఆ తరువాత నికితా మురళీ విజయ్‌ తో సహజీవనం ప్రారంభించింది. దాంతో భార్య మోసం చేసిందన్న బాధ ఒక వైపు, చిన్ననాటి స్నేహితుడు అయిన మురళీ విజయ్ చేసిన మోసాన్ని కార్తీక్ తట్టుకోలేకపోయాడు.అప్పటి నుండి దేవదాస్‌లాగా మారిపోయాడు. క్రికెట్ పైన దృష్టి పెట్టలేకపోయాడు. తోటి ఆటగాళ్ల చేత అవమానించ బడ్డాడు. అంతేకాక భారత జట్టులో చోటును కోల్పోయాడు. దాంతో పాటు తమిళనాడు కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. చివరకి దినేశ్ కార్తీక్ కి జీవితం మీద విరక్తి వచ్చి, ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న కార్తీక్ ట్రైనర్, ఇంటికెళ్లి మరి కార్తీక్ ని కలిశాడు. ఆయనకు జీవితం మీద ఆశలను పెంచి, మళ్లీ ట్రైనింగ్ ప్రారంభించేలా చేశాడు.
ఆ ఆతరువాత ట్రైనర్ ఇచ్చిన సూచనలతో జిమ్‌ చేయడం మొదలుపెట్టిన కార్తీక్‌కు,అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న దీపికా పల్లికల్ పరిచయమైంది. ఆమె ఎవరో కాదు భారత స్క్వాష్ ప్లేయర్. అయితే ఆమెకు క్రికెటర్లు అంటేనే అసహ్యించుకుంటుంది. కానీ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి అతన్ని ప్రేమించింది. ట్రైనర్‌తో కలిసి కార్తీక్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. కార్తీక్ ను గతంలో పడ్డ బాధలు మరచిపోయేలా చేయడమే కాక భారత జట్టుకు ఎంపికయ్యేలాగా అతన్ని ప్రోత్సహించింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు కవల పిల్లలు కలిగారు.
Also Read: టెస్ట్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు ఏం తింటారు..? లంచ్, టీ టైం లో ఏం పెడతారు..?

Ads

 

View this post on Instagram

 

A post shared by Nikita Vijay (@niki.vijay)

Previous articleరెండేళ్ళు పాటు ఉతక్కుండా ఒకే చొక్కాను వాడిన స్టార్ హీరో..
Next articleఅక్కడ ముందుగా పూలవర్షం కురిపించారు తరువాత కోడిగుడ్లతో కొట్టారని మెగాస్టార్ కామెంట్స్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.