భార్య పుట్టినరోజు సర్ప్రైజ్ గా భర్త ఇచ్చిన గిఫ్ట్.. విడాకులకు కారణం అయ్యింది.. ఎందుకంటే..?

Ads

భార్య పుట్టిన రోజును ఏ భర్త అయినా బాగా సెలెబ్రేట్ చేయాలని భావిస్తారు. అలాగే మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ గిఫ్ట్ వారి బంధాన్ని బలపరిచేదిగా ఉంటే సంతోషమే. కానీ ఆ గిఫ్ట్ వల్లే ఇద్దరు విడిపోతే బాధాకరంగా ఉంటుంది.

ఒక వ్యక్తి తన భార్యకు ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ వల్లే మనస్పర్థలు వచ్చి ఇద్దరు విడిపోయారు. ఈ సంఘటన తన ఫ్రెండ్ లైఫ్ లో జరిగిందని ఓ డేటింగ్ వైబ్‌సై‌ట్‌లో ఒక వ్యక్తి పోస్ట్  చేశాడు. ప్రస్తుత ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యూకేకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పుట్టినరోజుకు బహుమతిగా ఆమె కోసం ఒక డోర్‌బెల్ కొన్నాడు. అయితే ఈ డోర్ బెల్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదీ ఏమిటంటే ఆ డోర్ బెల్ కు బటన్ తో పాటుగా ఒక సీక్రెట్ కెమెరా అమర్చి ఉంది. ఆ కెమెరా లైవ్ రికార్డింగ్ ను మొబైల్ లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ విషయం ఆ భార్యకు తెలియదు. ఆ కెమేరాలోని ఫుటేజ్ అంతా ఆమె భర్త మొబైల్ కు వెళుతుంది. అసలు విషయం తెలియని ఆమె భర్త ఇచ్చిన డోర్ బెల్ ను ఇంటి మెయిన్‌డోర్‌కు అమర్చింది.
కొద్ది రోజుల అనంతరం సదరు భర్త మొబైల్‌ ఫోన్‌లోని సీక్రెట్ కెమెరా ఫుటేజ్ చూసినపుడు షాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటికి ఒక వ్యక్తి రాగా, అతని భార్య డోర్ తీసి బయటకు వెళ్ళింది. కెమెరా ముందు అంటే డోర్ బయటే ఇంటికి వచ్చిన వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.  ఇదంతా ఆమె భర్త డోర్‌బెల్‌ కెమెరా ద్వారా మొబైల్‌ ఫోన్‌లో చూశాడు.
తన భార్య వేరే వ్యక్తితో అలా ప్రవర్తన చూసిన ఆ భర్త షాక్ అయ్యాడు. అతని భార్య అతన్ని మోసం చేస్తుందనే విషయాన్ని నమ్మలేకపోయాడు. నిజం తెలుసుకున్న తరువాత అతడు కఠిన నిర్ణయాన్ని  తీసుకున్నాడు. ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ భర్త క్రమంగా భార్యకు దూరం అయ్యాడు. అలా వారిద్దరు విడిపోయారని పోస్ట్‌ చేసిన ఆమె భర్త ఫ్రెండ్ వివరించాడు. ఈ పోస్ట్‌ని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.

Ads

Also Read: ప్రియుడిని ఇంటికి పిలిచింది…చివరికి దొరికిపోయేసరికి చెప్పుతో కొట్టి ఎలా ప్లేట్ ఫిరాయించింది అంటే..?

 

 

Previous articleతింటున్న ప్లేటును తీసుకెళ్లిన వెయిటర్.. ఆ తరువాత ఏం చేశాడంటే..?
Next articleమనసు విరిగిన.. పరిస్థితులు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగా డాటర్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.