ఊరికి వెళ్ళిన భార్య తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న భ‌ర్త‌ కథ..

Ads

ఆ సమయంలో ఆమె వ‌య‌స్సు పన్నెండు ఏళ్లు. ఆ ఏజ్ లోనే పెళ్లి చేసుకోమని ఆమె న‌న్ను కోరింది. అయితే ఆమె చెప్పినదానికి వద్దని, అలా చేయడం స‌రి అయిన పని కాద‌ని చెప్పాను. ఆమె అప్పుడు నన్ను ఏమీ అనకుండా, ఒక కవర్ లో రెండు మిఠాయిలను తెచ్చి ఇచ్చింది.

అప్పుడే నాకు ఆమె అంటే ప్రేమ కలిగింది. అప్పటి నుండి పది సంవత్సరాల పాటు చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాను. అది చూసిన ఆమె తండ్రి మా ఇద్దరి వివాహానికి ఒప్పుకున్నారు. అయితే ఆయ‌న‌కు సొంత ఇల్లు, స్థ‌లం కూడా ఉంది. కానీ నాకు ఏమి లేదు. నేను ఒక అనాథ‌ను. నాకంటూ ఎవరు లేరు. నేను ప‌డే క‌ష్టం ఆయనను ఆకట్టుకుంది. దానివల్లే అతను త‌న కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేశాడు.

Ads

మా  పెళ్లి అయిన తరువాత ఆమెను వ‌దిలి క్ష‌ణం కూడా ఉండ‌లేనివాడిని. కానీ ప్రతిరోజూ ప‌నికి వెళ్లక తప్పదు. ఒక్కరోజు వెళ్లకున్న మాకు పూట గ‌డ‌వ‌ని పరిస్థితి. ఆక‌లితో అలమటించాల్సి వస్తుంది. అయితే అలాంటి స్థితిలో కూడా ఆమెను ఒంట‌రిగా వ‌దిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకునేది కాదు. అలాంటిది కొన్నిసార్లు నా భార్యను వ‌దిలి దూరంగా కొన్ని రోజుల పాటు పనికి వెళ్లాల్సి వ‌చ్చేది. అప్పుడప్పుడు ఆ పని మ‌ధ్య‌లో వ‌చ్చి నా భార్యను చూసి వెళ్ళేవాడిని. అయితే ఆమెను వ‌దిలి వెళ్ళేప్పుడు ప్రాణం పోతున్నట్లుగా అనిపించేది నాకు.
ఎప్పుడు ఇంటికి వెళ్లినా కూడా నా భార్య వేడి వేడిగా  ఆహారాన్ని వ‌డ్డిస్తుంది. ఆ తరువాత నా భార్య కూడా ప‌నికి వెళ్ల‌డం మొదలు పెట్టింది. ఇక ప‌ని నుండి నేను తొందరగా వచ్చినపుడు నా భార్య కోసం ఎదురు చూసేవాడిని. అలా కొన్ని రోజుల‌కు మేము పని నుండి వచ్చాక, సాయంత్రం పూట మా ఇంటి వద్దనే కోడిగుడ్ల‌ను అమ్మ‌డం మొదలు పెట్టాము. దాని వాళ్ళ అద‌నంగా మాకు కొంచెం ఆదాయం సమకూరేది. ఐదు సంవత్సరాలు అలాగే క‌ష్ట‌ప‌డి కొంచెం సంపాదించుకున్నాము. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ నా భార్య తండ్రి ఇల్లు వ‌ర‌దలు రావడంతో అందులో కొట్టుకునిపోయింది. ఇక వారు ఆ స్థలంలోనే చిన్న గుడిసె కట్టుకుంటున్నారు.నా భార్య తన తండ్రికి స‌హాయం చేయడానికి అక్కడికి వెళ్లింది. ఇప్పుడు ఆమె కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. నా భార్య తండ్రికి మాత్రమే కాకుండా చుట్టూ పక్కల ఉన్న న‌లుగురికి కూడా ఇల్లు మ‌ళ్లీ క‌ట్టుకోవడానికి స‌హాయం చేస్తోంది. వారు ఇళ్లను కట్టుకోవడానికి మాకు వీలైనంత స‌హాయాన్ని ఆర్థికంగా చేస్తున్నాము. ఆ ప‌ని పూర్తయ్యాక నా భార్య మా ఇంటికి తిరిగి వ‌స్తుంది. అప్ప‌టి దాకా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

Also Read: ఒకరి బట్టలని మరొకరు కట్టుకుంటే ఏం జరుగుతుంది..?

Previous articleత్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా మారకముందు ఏం చేసేవారో తెలుసా..!
Next articleపద్దెనిమిదేళ్ల కంటే ముందే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన.. 10 హీరోయిన్లు వీళ్ళే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.