Ads
అక్కినేని అఖిల్…. గత కొద్దికాలంగా సరియైన హిట్ లేక బాధపడుతూ…చాలా కష్టపడి తీసిన చిత్రం ఏజెంట్. ఈ మూవీ కోసం అఖిల్ తనని తాను ఎంతగానో మార్చుకున్నాడు…కసరత్తులు, ఫీట్లు చేసి నానా తండాలు పడ్డాడు. కానీ ఎందుకు అతనికి కాలం మాత్రం కలిసి రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ చిత్రం భారీ డిజాస్టర్ గానే మిగిలింది. థియేటర్లో విడుదలైన కొన్ని రోజులకే ఇలా వచ్చి అలా మెరుపుతీగలా మాయం అయింది.
ఇక ఆ తర్వాత మూడు వారాలకు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అని ప్రచారం జరిగినప్పటికీ…ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ…మూవీ మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ నోచుకోలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి మూవీ స్ట్రీమింగ్ వాయిదా మాత్రం పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. మొదట మేలో రిలీజ్ చేస్తాము అని వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు.
Ads
ఫైనల్ గా సెప్టెంబర్ 29న ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు మళ్లీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అది కూడా ఆగిపోయేలా ఉంది అని రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే విధించడం జరిగింది. ఎందుకంటే.. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర్ తనని మోసం చేశాడు అని విశాఖకు చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టులో కేసు వేయడం జరిగింది.
ఈ మేరకు విచారణ చేపట్టిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్.. బాదోపవాదాలు విన్న తర్వాత ప్రస్తుతానికి ఏజెంట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్టే విధించింది. ఈ విషయాన్ని సతీష్ లాయర్ మీడియాకు తెలియజేశారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లు…ఆ డిస్ట్రిబ్యూటర్ గొడవ కారణంగా తిరిగి మళ్లీ ఏజెంట్ చిత్రం ఆన్లైన్ స్ట్రీమింగ్ వాయిదా పడేలా ఉంది. మరి సోనీ లివ్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి…