ఇతను మామూలోడు కాదు…నటించిన 3 సినిమాలు… 2100 కోట్ల కలెక్షన్లు.! ఎవరో గుర్తుపట్టారా.?

Ads

సెంటిమెంట్లు సినిమాలు కవల పిల్లల లాగా ఉంటాయి. ఏదన్న మూవీలో ఒక పాయింట్ కలిసి వచ్చింది అంటే మిగిలిన అన్ని మూవీస్ వాటిని రిపీట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం సినిమాల్లో ఇదే రకంగా కామన్ గా ఒక నటుడు …లక్కీ చార్మ్ గా మారాడు. కమల్ హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ కి సూపర్ హిట్ ఓపెనింగ్ విక్రమ్ మూవీ తర్వాత ఇతను బాగా పాపులర్ అయ్యాడు. విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆ తర్వాత రజనీకాంత్ జైలర్ మూవీలోని కాకుండా షారుక్ జవాన్ లో కూడా కామన్ గా కనిపించాడు.  ఇంతకీ ఈ యాక్టర్ ఎవరో అనుకుంటున్నారా.. చూడ్డానికి పొట్టిగా ఉన్న యాక్షన్ మాత్రం గట్టిగా చేసే జాఫర్‌. ప్రత్యేకంగా స్క్రిప్ట్ లో చేంజ్ చేసి మరి అతని క్యారెక్టర్ ని ఉంచడానికి డైరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నారు అంటే జాఫర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. జైలర్ సినిమా 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక జవాన్ అయితే..బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.  ఇలా ఈ నటుడు నటించిన ఈ మూడు సినిమాల కలెక్షన్స్ కలిపితే 2000 కోట్లకు పైనే.

Ads

ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలలో వరుస పెట్టి జాఫర్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు. అతను సినిమాల్లో కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ ప్రస్తుతం అతను స్టార్స్ కి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారాడు. రీసెంట్ గా జవాన్ సినిమాలో జాఫర్ క్యారెక్టర్ మంచి స్పందన అందుకుంది. ఒకరకంగా చెప్పాలి అంటే విక్రమ్, జైలర్ ,జవాన్ ఈ మూడు సినిమాలు జాఫర్ కెరీర్ ని బాగానే సెట్ చేశాయి. తెలుగులో కూడా జాఫర్ ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. కానీ దాని ద్వారా అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇక జాఫర్ సాధిక్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తమిళనాడులో 1995లో జన్మించాడు జాఫర్ సాధిక్. అతని 4.8 అడుగులు. కెరీర్ స్టార్టింగ్ లో కోరియోగ్రాఫర్‌గా చేసారు. “పావ కధౌైగల్‌” అనే ఓ తమిళ వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత శివకార్తీకేయన్ డాక్టర్ సినిమాలో మరింత గుర్తింపు వచ్చింది. ఇక జైలర్, విక్రమ్, జవాన్ సక్సెస్ తమిళ్ డైరెక్టర్లకి ఈ నటుడు సెంటిమెంట్ గా మారిపోయారు అంట.

Previous articleఎట్టకేలకు ఇన్ని నెలలకు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనుకుంటే…పెద్ద ట్విస్ట్ ఎదురైందిగా.?
Next articleగుర్రాలను బట్టి ఆ రాజులు ఎలా చనిపోయారో చెప్పేయచ్చు తెలుసా.? ఎలాగో చూడండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.