2014 నుండి ప్రతి వరల్డ్ కప్‌లో ఇండియాకి ఇదే బలహీనత… ఈసారి అయినా అధిగమిస్తారా.?

Ads

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పటిష్టమైన జట్టులలో టీం ఇండియా ఒకటి. స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేని టీం అయినప్పటికీ.. ఐసీసీ టోర్నీలలో ఛాంపియన్ గా నిలవలేక పోతోంది. చివరిసారిగా 2013 లో జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీను భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు చాంపియన్గా నిలిచింది కానీ ఆ తరువాత ఇంతవరకు ఐసీసీ టోర్నీలలో తిరిగి విజేతగా అవతరించిన సందర్భం లేదు.

world cup india

ఆరంభ మ్యాచ్లలో అదరగొట్టే పర్ఫామెన్స్ కనబరిచినా…చివరకు చేతులు ఎత్తేసి ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడిపోయి తిరిగి రావడం…సెమీస్ లోకి కూడా వెళ్లకుండా వెను తిరగడం…సాధారణంగా మారిపోయాయి. ఇలా సెమీఫైనల్ గండంతో తడబడుతున్న టీం ఇండియా ఈసారైనా ప్రపంచ కప్ తన ఖాతాలో వేసుకునే నా అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 టి20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ వరకు వెళ్లి చేతులెత్తేసింది. 2017 ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ లో తడబడింది.. 2019 ప్రపంచకప్ వన్డే సెమీఫైనల్లో చతికిల పడింది. ఇక లేటెస్ట్ గా 2022 టి20 ప్రపంచకప్ కూడా సెమీస్ గండాన్ని దాటలేక ఇబ్బంది పడింది.

Ads

ఈ మధ్య జరిగిన రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ను తన సత్తా చాటుకుని ఫైనల్ కు రెండుసార్లు భారత్ చేరినప్పటికీ కప్పు మాత్రం ఖాతాలో వేసుకోలేక పొయింది. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా కి ఉన్న చోకర్స్ టీమ్ అనే టాగ్ లైన్ ప్రస్తుతం టీమిండియాను వెంటాడుతుంది. ప్రతి మ్యాచ్ లో తన సత్తా చూపించే టీమ్ ఇండియా.. డూ ఆర్ డై మ్యాచ్ అనేసరికి తుస్సుమంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్లలో కూడా మొదటి రెండు మ్యాచ్లలో పూర్తి సత్తా కనబరిచి.. మూడో వన్డేలో చేతులెత్తేసింది.

టీం ఇండియాలోని ఈ వైఖరి ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. అక్టోబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లలో కూడా ఇదే తీరు కనబరిస్తే కష్టమనేది వాళ్ళ ఉద్దేశం. మ్యాచ్ గ్రూప్ దశలో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఆడి…సెమీస్ లేక ఫైనల్ దశకు చేరుకునే సమయానికి పేలవంగా పర్ఫార్మ్ చేస్తారేమో అనే భయం ఇండియన్ క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది. కనీసం ఈసారైనా భారత్ ప్రపంచ కప్ కోటి తీరాలి అనేది అందరి ఆకాంక్ష.

Previous articleఅది ట్రైన్ అనుకున్నారా లేదా.? ఫుల్లు స్పీడుతో బ్రిడ్జి పై ట్రైన్ వస్తుంటే ఆ ముగ్గురు యువకులు..చివరకు.?
Next articleఎట్టకేలకు ఇన్ని నెలలకు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనుకుంటే…పెద్ద ట్విస్ట్ ఎదురైందిగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.