ఈ ఏడాదిలో మరణించిన 12 మంది తెలుగు సినీ ప్రముఖులు..

Ads

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు అభిమాన స్టార్స్ ను కోల్పోయారు. ముఖ్యంగా లెజెండరి యాక్టర్స్ అయిన సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది.

ఇక ఈ సంవత్సరం మహేష్ బాబుకి అస్సలు బాలేదు. మహేష్ బాబుకి ఈ సంవత్సరం తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోయారు. అన్న రమేష్ బాబు, మాతృమూర్తి ఇందిరాదేవి ఆ తరువాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారిని కోల్పోయారు. కాగా 2022లో ఇలాగే పదిమంది తెలుగు సినీ ప్రముఖులు ఆకస్మికంగా మరణించడంతో వారి కుటుంబాలు, అభిమానులు దుఖంలో మునిగిపోయారు. ఆకస్మాత్తుగా మరణించిన ఆ ప్రముఖులు ఎవరో చూద్దాం..

#1.సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన గుండెపోటుతో నవంబర్ 15న కన్నుమూశారు. దీంతో మహేష్ బాబు, ఆయన కుటుంబం ఒంటరి అయ్యారు.#2. కృష్ణంరాజు
రెబల్ స్టార్, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మరణించారు. ఆయన కూడా ఆకస్మాత్తుగా చనిపోవడంతో టాలీవుడ్ lo విషాదం నెలకొంది.
#3.బప్పి లహిరి
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి ఫిబ్రవరి అనారోగ్య కారణాలతో 16న తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీల్లో సంగీతం అందించారు.#4.రమేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లోనే మరణించారు.
#5.యూట్యూబర్ గాయత్రి
యూట్యూబ్ గా పాపులర్ అయిన గాయత్రి కూడా ఇదే ఏడాది రోడ్డు యాక్సిడెంట్ లో గాయత్రి మృతి చెందారు.
#6.ఘట్టమనేని ఇందిరా
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించారు. చనిపోయే ముందు ఆమె అనారోగ్యంతో బాధపడ్డారు.

Ads

#7.మన్నవ బాలయ్య
తెలుగు సీనియర్ నటుడు బాలయ్య కూడా ఇదే సంవత్సరం మరణించారు.
#8.డిఎంకె మురళి
తెలుగు సినీ నటుడు మరియు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మురళి కూడా ఇదే సంవత్సరం మరణించారు.#9.నందమూరి ఉమామహేశ్వరి
సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె నందమూరి ఉమామహేశ్వరి కూడా ఇదే ఏడాది మృతి చెందారు. ఉమామహేశ్వరి మరణం పై చాలా రకాల వార్తలు వచ్చాయి.
#10.గురు స్వామి(మహర్షి తాత)
మహర్షి సినిమాలో నటించిన నటుడు గురుస్వామి ఈ ఏడాదే మరణించాడు. ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

#11. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న కన్నుమూశారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. #12.సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తి రావు శనివారం(డిసెంబర్ 24) రాత్రి గుండె పోటుతో మరణించారు. 

Also Read: టాలీవుడ్ లో నిరాశ పరిచిన ‘ సీక్వెల్ ‘ సినిమాలు..!

Previous articleగుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాస్య నటి కోవై సరళ.. ఫోటో వైరల్..!
Next articleహన్సిక లాగే విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్న10 మంది స్టార్ హీరోయిన్లు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.