గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న”నాటు నాటు” పాట గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

Ads

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందనేది అందరికి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా అవార్డుల పరంగానూ అంతర్జాతీయంగా దూసుకెళ్తుంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇండియన్ సినిమాలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చూసే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కైవసం చేసుకుంది.

Ads

ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఈ సినిమా నుండి ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును గెలుచుకుంది. ఇక ఆసియా నుంచి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్న మొదటి పాట ‘నాటు నాటు’ నే. ఈ సాంగ్ కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో సినీ ప్రముఖులు ఈ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ, అభినందనలు తెలుపుతున్నారు. అయితే అసలు ఈ సాంగ్ కు పునాది ఎలా పడింది? ఈ సాంగ్ కోసం జక్కన్న ఎన్ని టేకులు తీసుకున్నాడు? ఇలాంటి ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్‌ డ్యాన్స్‌ర్ల జాబితాలో రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు కూడా ఉంటాయి.అయితే ఈ సినిమా ముందు వరకు కూడా వీళ్లిద్ధరి డాన్స్ లను విడివిడిగా చూసి ఎన్నో సార్లు బెస్ట్ డాన్సర్స్ అని అనుకున్నాం. అలాంటి ఇద్ధరు డాన్సర్స్ కలిసి ఒకే పాటలో ఒకేసారి డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందా అని జక్కన్న ఆలోచించాడట. అలా ఆలోచనే వచ్చిందే తడువుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని పిలిపించి, రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి డ్యాన్స్‌ చేయడానికి ఒక మంచి మాస్‌ సాంగ్ కావాలి అని చెప్పాడట. కీరవాణి ఈ సాంగ్ ను ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు గుర్తొచ్చిన పేరు చంద్రబోస్‌. ఇప్పటివరకు కీరవాణి కంపోజ్ చేసిన ఎన్నో పాటలకు రచయిత చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించాడు. ఇక జక్కన్న అడిగిన మాస్‌ పాటకు చంద్రబోస్‌ న్యాయం చేయగలడని భావించి కీరవాణి ఆయన్ని పిలిచి, చరణ్, తారక్ ఇద్దరు డాన్సుల‌తో అద‌ర‌గొట్టే పాట కావాలి. మీకు ఎలా న‌చ్చితే అలా రాయండి. కానీ ఈ స్టోరీ 1920ల కాలం నాటిది. కాబ‌ట్టి ఆ కాలానికి తగ్గట్టుగా ఉండే మాట‌లు వాడాలి అని చంద్రబోస్‌కు చెప్పాడట. దానికి చంద్రబోస్‌ సరే అని అక్కడి నుండి వెళ్లిపోయాడట. ఆ తరువాత నుండి చంద్రబోస్‌ ఆలోచనలు ఎలాంటి పాట రాయాలి అనేదాని చుట్టే తిరుగుతూ ఉండేవి. అలా ఆయన ఆలోచనల నుండి వచ్చిన పదమే ‘నాటు నాటు’. అయితే అప్పటికి ఇంకా ఈ సాంగ్ కు ట్యూన్‌ ఏమిలేదు. అయితే చంద్రబోస్‌ మాత్రం తన వెర్షన్‌లో పాటను రాశాడు.
మూడు పల్లవులు రాసుకుని రెండు రోజుల్లో కీరవాణికి ఇచ్చాడంట. వాటి నుండి ‘పొలం గట్టు’తో సాగేదాన్ని జక్కన, కీరవాణిలు ఒకే చేశారంట. చంద్రబోస్‌ రాసిన ‘నా పాట పాడు’ అనేదాన్ని కీరవాణి ‘నా పాట చూడు’గా మార్చాడు. ఇక అప్పటికి ఈ సాంగ్ తొంబై శాతం పూర్తవడం, ట్యూన్‌ రెడీ అవడంతో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఈ పాట పూర్తి కావడానికి సుమారుగా 19 నెలల సమయం పట్టింది. మొత్తానికి పాటపూర్తవగానే మూవీ యూనిట్‌ పాటను షూట్ చేయడానికి ఉక్రెయిన్‌ వెళ్లింది. పాటను షూట్ చేస్తున్నప్పుడు జక్కనకి అసంతృప్తిగా అనిపించి చంద్రబోస్‌కు కాల్‌ చేసి, సాంగ్ చివరి 2 లైన్లు మార్చమాని చెప్పడంతో చంద్రబోస్‌ 15 నిమిషాల్లోనే వాటిని మార్చాడు. ఇలా ‘నాటు నాటు’ పాట కోసం 19 నెలలు పట్టిందని చంద్రబోస్‌ ఒక సందర్భంలో తెలిపాడు.
ఇక సాంగ్ ఓకే అయ్యాక, కొరియోగ్రాఫర్ గా జక్కన్న తన సినిమాల్లోని ఎన్నో సాంగ్స్ కి నృత్యాలను అందించిన ప్రేమ్‌ రక్షిత్‌ను ఎన్నుకున్నాడు. ఇక ఆయన ఈ సాంగ్ కోసం 95 స్టెప్పులను కంపోజ్‌ చేశాడట. ఇద్దరు హీరోలు భూజాలపై చేతులేసుకుని చేసిన హూక్‌ స్టెప్‌ కోసం అయితే ఏకంగా ముప్పై వెర్షన్‌లు సిద్ధం చేశాడట. ఇక రాజమౌళి ఆ స్టెప్‌ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం 19 టేకులు తీసుకున్నా, ఫైనల్ గా మాత్రం 2 వ టేకునే ఓకే చేశాడు. ఇలా ఈ ఒక్క పాట కోసం మూవీ యూనిట్ చిన్న సైజ్ యుద్ధం చేసింది. ఇక వారి కష్టానికి తగ్గట్టుగా అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి.Also Read: ఆ స్టార్ హీరోకి లవర్ గా, ప్రస్తుతం వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Previous articleఏడాదికి రెండు సార్లు ఎందుకు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?
Next articleప్రేమ పెళ్ళా..? వాళ్ళ లవ్ స్టోరీ ని షేర్ చేసుకున్న ”దిల్ రాజు”..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.