ప్రేమ పెళ్ళా..? వాళ్ళ లవ్ స్టోరీ ని షేర్ చేసుకున్న ”దిల్ రాజు”..!

Ads

దిల్ రాజు తెలియని వాళ్ళు ఉండరు. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలకు పైగా తీశారు దిల్ రాజు. ప్రొడ్యూసర్ గా బాగా ఎదిగారు. తాజాగా విడుదల అయిన వారసుడు సినిమాకి దిల్ రాజే ప్రొడ్యూసర్. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లో విడుదల అయిన విషయం తెలిసిందే.

ఎక్కువగా ఈ మధ్య వార్తల్లో దిల్ రాజు కనబడుతున్నారు. దిల్ రాజు సినిమాలకి సంబంధించిన విషయాలు అందరికీ తెలిసిందే.

కానీ తన లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. దిల్ రాజు లవ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం చూద్దాం. డిస్ట్రిబ్యూటర్ గా మొదట ఈయన కేరీర్ ని స్టార్ట్ చేసారు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈయన సినిమాలు చేస్తున్నారు. అయితే ఈయ భార్య అనిత 2017లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. తరవాత 2020లో లాక్ డౌన్ సమయం లో ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. తేజస్విని అనే ఓ అమ్మాయిని దిల్ రాజు సెకండ్ మేరేజ్ చేసుకున్నారు. వైఘారెడ్డిగా ఆమె తన పేరు ని పెళ్ళయాక మార్చుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి ఎరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ వుంది.

Ads

కానీ ఈ కథ చాలా మందికి తెలీదు. దిల్ రాజు ఈ ప్రేమ కథ ని బయటపెట్టారు. భార్య అనిత చనిపోయిన రెండు ఏళ్ళూ కూడా ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారట. అయితే బిజీ లైఫ్ వలన ఆయనని అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకునే… ఈ పెళ్లి చేసుకున్నారు. ఎక్కువగా ఆయన విమాన లో ట్రావెల్ చేసేవారట. ఆ టైం లోనే తేజస్విని పరిచయమైంది. ఆ తరవాత ఫోన్స్ ద్వారా ఏడాదిపాటు ఆమెని అర్థం చేసుకోవడానికి చూసి… తర్వాత ప్రపోజ్ చేశారట. ఆమె కూడా సరే అన్నాక పెద్దలకి చెప్పారట. ఇలా వీళ్ళు పెళ్లి చేసుకున్నారట.

Previous articleగోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న”నాటు నాటు” పాట గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
Next articleనటి హేమ భర్త ఏం చేస్తారో, ఎలా ఉంటారో తెలుసా?