Ads
తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా గుర్తింపు సంపాదించుకున్న నటుడు జయం రవి. జయం రవి హీరోగా నటించిన సైరెన్ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: సైరెన్
- నటీనటులు: జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్.
- దర్శకుడు: ఆంటోనీ భాగ్యరాజ్
- సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
- నిర్మాత : సుజాత విజయ్ కుమార్
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 23, 2024
కథ:
తిలకన్ అలియాస్ తిలకవర్మన్ (జయం రవి) 14 సంవత్సరాలు జైలులో ఉండి తర్వాత పెరోల్ మీద బయటకి వస్తాడు. అందుకు కారణం తన కూతురు మలర్ (యువినా పార్థవి) ని చూడాలి అనుకుంటాడు. ఆ కారణంగానే జైలు నుండి బయటికి వస్తాడు. అయితే తిలకన్ బయటికి వచ్చిన తర్వాత కొంత మంది చనిపోవడం జరుగుతుంది. అయితే, వాళ్లు చనిపోయిన సమయంలో తెలిసి తెలియకుండా తిలకన్ అక్కడే ఉంటాడు.
అప్పటికే ఒకరిని చంపిన కారణంగా జైలుకు వెళ్తాడు. దాంతో మళ్లీ వచ్చాక కూడా ఇలా జరగడంతో నందిని (కీర్తి సురేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఈ విషయం మీద దర్యాప్తు చేయడం మొదలు పెడుతుంది. అసలు తిలకన్ ఎవరు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? తిలకన్ భార్య (అనుపమ పరమేశ్వరన్) కి ఏమయ్యింది? వాళ్ళందరిని ఎవరు చంపుతున్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రివెంజ్ డ్రామా అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు మనకి కొత్త ఏమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి కాన్సెప్ట్ కూడా సినిమాలు చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజెంటేషన్ మారితే సినిమా రిజల్ట్ కూడా మారుతుంది. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం కూడా తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఆధారంగానే నడుస్తుంది. ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అలానే ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టోరీ.
కానీ తండ్రి కూతుర్ల ఎమోషన్ మాత్రం అలాగే అనిపిస్తుంది. తన తండ్రి ఏదో నేరం చేశాడు అని అపార్థం చేసుకొని కూతురు తండ్రికి దూరంగా ఉండడం, కానీ తండ్రి మాత్రం తన కూతురిని చూడాలి అని అనుకోవడం, ఇలాంటివి మనం చూసాం. సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం చాలా చోట్ల తడబడ్డారు.
Ads
ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రలని చూపించడంలోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు కానీ పొరపాట్లు జరిగాయి. కొన్ని చోట్ల మాత్రం ఎమోషన్స్ మరీ అతిగా చూపించారు ఏమో అనిపిస్తుంది. అసలు హీరో అలా చేయడానికి బలమైన కారణం ఏదీ ఉండదు అని చాలా చోట్ల అనిపిస్తుంది. అవన్నీ ఇంకా కొంచెం జాగ్రత్తగా రాసుకొని ఉండాల్సింది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జయం రవి ఒక పెద్దాయన పాత్రలో, అలాగే ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ పాత్రలో కనిపించారు. తన పాత్ర వరకు తను బానే నటించారు.
సాధారణంగా ఇలాంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే మగవారు మాత్రమే ఉంటారు. కానీ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కీర్తి సురేష్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించారు. ఈ ప్రయత్నం బాగుంది. కీర్తి సురేష్ బాగా నటించారు. ఇలాంటి పాత్రలో మనం అంతకుముందు కీర్తి సురేష్ ని చూడలేదు. అనుపమ పరమేశ్వరన్ మాటలు రాని ఒక అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో నటించారు. కనిపించేది కొంచెం సేపు అయినా కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు.
జయం రవి, అనుపమ పరమేశ్వరన్ కూతురుగా నటించిన యువినా పార్థవి పర్లేదు. యోగి బాబు, సముద్రఖని వంటి నటులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఇలాంటి పాత్రల్లో అంతకుముందు చాలా సార్లు నటించారు కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు. కానీ పాత్రలకి న్యాయం చేశారు. జీవి ప్రకాష్ అందించిన పాటలు కూడా మరీ గొప్పగా లేవు. సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. రూబెన్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ సినిమా టేకింగ్ విషయంలో మాత్రం కొన్ని చోట్ల లాజిక్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
- నిర్మాణ విలువలు
- ఎడిటింగ్
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథనం
- లాజిక్ లేని సీన్స్
రేటింగ్:
2.5/5
ఫైనల్ గా:
ఇలాంటి సినిమాలు మనం అంతకుముందు చూసాం. అయినా కూడా ఈ సినిమాలో అసలు కథనాన్ని ఎలా చూపించారు అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సైరెన్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : జయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారా..? శోభన్ బాబు డైరీలో ఏం రాశారు..?