ఎమ్మెల్యే లాస్య నందిత కారుకి ప్రమాదం ఎలా జరిగింది..? సీట్ బెల్ట్ పెట్టుకున్నారా..?

Ads

తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కార్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. దాంతో తీవ్ర గాయాల పాలు అయిన లాస్య నందిత, అక్కడికి అక్కడే చనిపోయారు.

స్థానికుల సమాచారం మేరకు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, అతివేగంతో కారు అదుపుటప్పడం ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చారు.

mla lasya nandita car

కారు వేగంగా వెళ్లి, అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొంది. నందిత ఘటనస్థలిలోనే చనిపోగా, ఆమె పిఏ ప్రకాష్, డ్రైవర్ గాయపడ్డారు ఈ ప్రమాదం మేడ్చల్ నుండి పఠాన్ చెరు వెళ్తున్నప్పుడు జరిగింది. వారి ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించడానికి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాంతో అదుపుతప్పి ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ నిపుణులు మాత్రం ఈ విషయం మీద పలు కరణాలు చెబుతున్నారు. నందిత మారుతి సుజుకి XL6 కారులో ప్రయాణిస్తున్నారు. ఇందులో సేఫ్టీ తక్కువగా ఉంటుంది. సడన్ బ్రేక్ వేయడంతో, అంతే కాకుండా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంతో, ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ పాడయ్యాయి అని చెప్తున్నారు.

Ads

mla lasya nandita car

అంతకుముందునార్కట్‌పల్లిలో నందిత ప్రయాణిస్తున్న స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ ని అప్పుడే మార్చి ఉంటే నందిత బతికి ఉండేవారు అని అంటున్నారు. లేదా ఆ కారు ఇప్పుడు ఉన్నా కూడా ఇంత ప్రమాదం జరిగేది కాదు అని అంటున్నారు. గత సంవత్సరం నందిత తండ్రి సాయన్న ఫిబ్రవరిలో చనిపోయారు. దాంతో ఆ టికెట్ ని పార్టీ వారు నందితకి ఇచ్చారు. నందిత మృతదేహాన్ని పఠాన్ చెరులో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు నందితని చివరిసారి చూడడానికి వెళ్లి తమ నివాళులు అర్పిస్తున్నారు. నందిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Previous articleఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఇంత స్టైలిష్ గా అయిపోయారేంటి..?
Next articleSIREN REVIEW : “జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!