Ads
తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు జూనియర్ ఎన్టీఆర్ ది. తన మార్కు నటనతో యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఈ నందమూరి వారసుడు, నటనలో తాత ఎన్టీఆర్ కు తగ్గ మనవడిగా నిరూపించుకున్నారు.
R R R తో తన కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఎన్టీఆర్, సినే రంగంలో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్, అదృష్టం మాత్రమే కాదు పట్టుదల, శ్రమ కూడా ఉండాలి అని నిరూపించారు.
ఇప్పటికే సినీ రంగంలో తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్న ఎన్టీఆర, తాత బాటలోనే రాజకీయాల్లోకి వస్తాడనీ, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే జనం ఆయన తాత గారికి పట్టినట్లుగా బ్రహ్మరథం పడతారని అందరూ అనుకునే విషయమే. చాలామంది ఎన్టీఆర్ ఎక్కడ రాజకీయాల్లోకి వస్తాడు అని భయపడేవాళ్లు ఉండనే ఉన్నారు. మరోపక్క అప్పుడెప్పుడో మెరుపు వేగంగా ఎలక్షన్ ప్రచారంలోకి ఎంటర్ అయిన ఎన్టీఆర్ ఆ తరువాత సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఇక తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశమే లేదన్నట్టు తారక్ మౌనం వహిస్తున్నారు.
Ads
ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఈ మధ్యన సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటే ఆయన జాతకం ప్రకారం మన రాష్ట్రానికి సిఎం ఎంటి మన దేశానికి పిఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిష్యులు చెప్పిన మాటలు హల్ చల్ చేస్తున్నాయి.
మరి ఇంతమంది ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందో, ఒకవేళ జరిగితే ఆయనకి ఉన్న పట్టుదలకి, ఫాలోయింగ్ కి ఆయన జ్యోతిష్యులు చెప్పిన విధంగా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారో కాలమే నిర్ణయించాలి.