అతను ఉంటే ఇండియా టీం ఓడిపోతుంది…ఆ శనిగాడి కోసం అంత మంచి ప్లేయర్ ని పక్కన పెడతావా రోహిత్.?

Ads

వన్డే ప్రపంచ కప్ 2023 లో ఇండియా తరఫున బరిలోకి దిగబోతున్న క్రికెట్ టీం వివరాలను బీసీసీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడినటువంటి టీం ఇండియా జాబితాను కెప్టెన్ రోహిత్ శర్మ ,సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కలిసి వెల్లడించారు. మంగళవారం నాడు అగర్కర్ ,రోహిత్ శర్మ ఇదే విషయంపై మీడియాతో ముచ్చటించారు.ఈ నేపథ్యంలో 2023 టోర్నమెంట్కు ఎంపిక చేసిన జట్టుని వన్డే ప్రపంచకప్ కు దాదాపుగా కొనసాగిస్తామని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం టీంకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో పలు రకమైన చర్చలకు దారి తీస్తున్నాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లు పేసర్ ప్రసిధ్ కృష్ణతో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు జట్టులో స్థానం దక్కలేదు. మరోపక్క ఫిట్నెస్ విషయంలో పలు రకాల టాప్స్ ఉన్నప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ కు టీం లో ప్లేస్ కన్ఫర్మ్ అయింది.

సీనియర్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌ల జాడ లేదు. సూర్యకుమార్ యాదవ్ కు లక్కీగా టీం లో బెర్త్ దొరికింది. ప్రస్తుతం సెలక్టర్లు అనౌన్స్ చేస్తున్న ఈ టీం పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బాగుంది అంటుంటే …మరికొందరు ఫిట్నెస్ సరిగ్గా లేని వాళ్ళు , నిలకడైన ప్రదర్శన కనబరచిన వాళ్ళు టీం లో ఉండే మాత్రం చేసేది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

Ads

team india take care of these things before asia cup

క్రికెట్ అభిమానులే కాదు ఒకప్పటి స్టార్ ప్లేయర్స్ కూడా కమిటీ తీసుకున్న నిర్ణయం పై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పటి టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ..యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ లోకి తీసుకోకపోవడం పై స్పందిస్తూ.. ఒక మ్యాచ్ విన్నర్ ను పక్కన పెట్టారు అని ట్వీట్ చేశారు. మరి కొందరు ఫిట్నెస్ విషయంలో తలపటాయిస్తున్న రాహుల్ ను ఏ బేసిస్ పై టీమ్ లోకి తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు. పెద్దగా ఫోమ్ కనబరచిన రాహుల్ కోసం మాంచి ఫామ్ లో ఉన్న లెఫ్టార్మ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడంపై క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. పైగా రాహుల్ ఉంటే టీం ఇండియా ఓడిపోతుంది. ఆ శనిగాడి కోసం మంచి ప్లేయర్ ని పక్కన పెడతారా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక భారత ప్రపంచకప్ జట్టు విషయానికి వస్తె…బీసీసీఐ ప్రకటించిన ప్లేయర్స్ జాబితా..ఇదే .

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

Previous articleఅచ్చం వై.ఎస్.భారతి లా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Next articleఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే జరిగేది ఇదే అంట.? ఆయన జాతకం ప్రకారం ఏముందంటే.?