Ads
మహానటి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. డబ్బింగ్ సినిమాలు ..డైరెక్ట్ గా తెలుగులో చేసిన సినిమాలు.. ఇలా మొత్తం మీద టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు సరికొత్తగా కింగ్ ఆఫ్ కొత్త అని మాస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ ఎంత మాత్రం సక్సెస్ అయ్యాడో తెలుసుకుందాం…
- చిత్రం : కింగ్ ఆఫ్ కొత్త
- నటీనటులు : దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డ్యాన్స్ రోజ్ షబీర్.
- నిర్మాత : దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్
- దర్శకత్వం : అభిలాష్ జోషి
- సంగీతం : జేక్స్ బిజోయ్
- విడుదల తేదీ : ఆగస్ట్ 24, 2023
స్టోరీ :
ఈ మూవీ మొత్తం 1980 కాలం నేపథ్యంలో సాగుతుంది. ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అయిన రాజు(దుల్కర్ సల్మాన్) అనుకోని కొన్ని కారణాలవల్ల సమస్యల్లో ఇరుక్కుంటాడు. వాటిని పరిష్కరించే ప్రయత్నంలో ఊహించని విధంగా ఊరిని శాసించే నాయకుడిగా మారుతాడు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఎందుకని ఇలా మారాడు? అసలు అతని ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రాజుకు సమస్యలు కలగడానికి కారణం ఎవరు? నాయకుడు అయిన తర్వాత రాజు ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఓటీటీ పుణ్యమా అని ఆడియన్స్ ఒక్క లాంగ్వేజ్ మూవీస్ కి పరిమితం కావడం లేదు. సినిమా ఏ భాషలో వచ్చిన సరే కంటెంట్ కనెక్ట్ అయితే చాలు దాన్ని విపరీతంగా ఆదరించి హిట్ చేసేస్తున్నారు. అందుకే కంటెంట్ ఉన్న చిత్రాలు ఏ భాష నుంచి వచ్చిన సరే అన్ని భాషల్లో డబ్బింగ్ వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా మలయాళం సినిమాలకు టాలీవుడ్ లో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
పైగా దుల్కర్ సల్మాన్ కు కేవలం మలయాళం లోనే కాక తమిళ్, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ మూవీని అన్ని భాషల్లో విడుదల చేయడం జరిగింది. జనరల్ గా చెప్పాలి అంటే ఈ స్టోరీ లైన్ తో వచ్చిన సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి…ఇది కొత్తేమీ కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ సినిమాను తీసిన విధానం మాత్రం ఎంతో డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది అని చెప్పవచ్చు.
Ads
ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంతో రొటీన్ గా పాత్రలను పరిచయం చేయడంతో సరిపోతుంది. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. అయితే ఈ మూవీ చాలా స్లోగా సాగుతుంది. కానీ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజు పాత్రకు దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనడంలో ఎటువంటి డౌటు లేదు. మూవీలో ఇంట్రెస్టింగ్ గా ఉండే మరొక పాత్ర నైలా ఉష పోషించిన పాత్ర. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది.
సిచువేషన్ కి, సీన్ కి తగినట్టుగా మ్యూజిక్ ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. రవి అందించిన సినిమాటోగ్రఫీ కూడా చిత్రాన్ని హైలైట్ చేసే విధంగా ఉంది. మూవీ కోసం డిజైన్ చేసిన సెట్స్ చాలా పర్ఫెక్ట్ గా 1980 కాలం కు చెందినవి అనిపించే విధంగా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ అయితే ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- ఇందులో ప్రతి యాక్టర్ తమ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా నటించారు.
- మూవీలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్లెంట్ గా సెట్ అయింది.
- సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది.
- యాక్షన్ సీన్స్ చాలా న్యాచురల్ గా మూవీలో సెట్ అయ్యే విధంగా తీయడం జరిగింది.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ చాలా రొటీన్ గా ఉంది.
- మూవీలో సెకండ్ హాఫ్ అంటే రోమాంజితమైన సన్నివేశాలతో స్పీడ్ కథనంతో సాగాలి. కానీ ఈ మూవీ అందుకు భిన్నంగా స్లో సెకండ్ హాఫ్ తో ఉంది.
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మూవీ స్లోగా ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆర్ట్ మూవీస్ ,యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. కింగ్ ఆఫ్ కొత్త మూవీ మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని చెప్పవచ్చు.
watch trailer :
Also Read : పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?