పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

మెహర్ రమేష్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ, దానిని ఉపయోగించుకోలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. అతను ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్ని స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం.

Ads

స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి వారికి డిజాస్టర్ అందిస్తున్న డైరెక్టర్ గా మెహర్ రమేష్ కి పేరు వచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో చేసిన భోళా శంకర్ కూడా ప్లాప్ అవడంతో సోషల్ మీడియాలో అతని పై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి.మెహర్ రమేష్ దాదాపు 10 సంవత్సరాల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం మూవీ భోళా శంకర్. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించారు. చిరంజీవి చెల్లెలు పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా, ఆమెకు జంటగా హీరో సుశాంత్ కనిపించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యి, తొలి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీపై, డైరెక్టర్ మెహర్ రమేష్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ , మీమ్స్ విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. నెటిజెన్లు మెహర్ రమేష్ ను ఓ రేంజ్ లో విమర్శిస్తూ కామెంట్స్ చేశారు.
మెహర్ రమేష్ కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రావాలా మూవీ తెలుగులో, అదే కథతో అదే సమయంలో కన్నడలో వచ్చిన పునీత్ రాజ్‌కుమార్‌ హీరోగా ‘వీర కన్నడిగ’ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అక్కడ హిట్ అయ్యి, 100 రోజులు ఆడింది. ఆ తరువాత మెహర్ రమేష్ తెలుగులో అడుగుపెట్టి, ఎన్టీఆర్ హీరోగా కంత్రి, శక్తి, ప్రభాస్ హీరోగా బిల్లా, వెంకటేష్ హీరోగా షాడో వంటి డిజాస్టర్ చిత్రాలను తీశాడు.
ఆ మూవీ తరువాత సినిమా అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూసిన రమేష్ కు మెగాస్టార్ తో భోళా శంకర్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ కూడా ఎప్పటిలానే ప్లాప్ అవడంతో మెహర్ రమేష్ గురించి నెట్టింట్లో ఏదో విధంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో మెహర్ రమేష్ గతంలో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous articleపెళ్ళికి ముందు రోజు అబ్బాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది..? ఈ సినిమా చూశారా..?
Next articleయూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమించొద్దు’ సెన్సార్ పూర్తి.. జూన్ 7న విడుదలకు స‌న్నాహాలు
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.