Ads
ఎన్నో తరాల ప్రేక్షకులని తన గాత్రంతో అలరించిన గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. కేవలం గాయకులుగా మాత్రమే కాకుండా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో గుర్తింపు పొందారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా ఆయన పాటల రూపంలో ఇప్పటికీ మనకి చేరువలోనే ఉన్నారు. మనందరి మధ్యలో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని ప్రతి ఒక్క తెలుగు వారు. కాదు కాదు. ప్రతి ఒక్క దేశానికి చెందిన వారు తమ ఇంటి వ్యక్తిగా భావించారు.
ఇప్పటికి కూడా అలాగే భావిస్తున్నారు. ఆయన పాట లేనిదే రోజు గడవని వారు ఎంతో మంది ఉంటారు. అలా ఆయన పాటల రూపంలో మన మధ్యలో ఇంకా ఉన్నారు. అయితే, చాలా కాలం క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక లెటర్ రాశారు. అందులో చెన్నై నుండి బాలసుబ్రమణ్యం గారు లెటర్ రాస్తున్నట్టు ఉంది.
Ads
ఆ లెటర్ లో ఈ విధంగా రాశారు. ఈ లెటర్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, “శ్రీ ప్రకాష్ గారికి, నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలు. నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను. కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయచేసి నా పేరు ముందు, “డాక్టర్”, “పద్మభూషణ్”, “గాన గంధర్వ” లాంటి విశేషణలు వాడకండి. మనకి ఇంకా వ్యవధి ఉంది. కాబట్టి ప్రయాణ వివరాలు త్వరలో తెలుపగలరు. కృతజ్ఞతలతో, ఎస్పీ బాలసుబ్రమణ్యం” అని ఈ లెటర్ లో రాశారు.
డాక్టర్, పద్మభూషణ్, గాన గంధర్వ వంటి బిరుదులు అన్నీ కూడా బాలసుబ్రమణ్యం గారి విశేష సేవకి మెచ్చి ఇచ్చిన గుర్తింపు. కానీ అవన్నీ ఆయన వద్దు అన్నారు. ఆయన ఎంత గొప్పవారు అనేది ఇది చూస్తేనే అర్థం అవుతోంది. ఇలాంటివి వాడకండి అనే విషయాన్ని కూడా ఇంత సున్నితంగా చెప్పడం కేవలం ఆయనకి మాత్రమే సాధ్యం అవుతుంది ఏమో. అందుకే ఆయన గొప్ప వ్యక్తిగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఎప్పటికీ నిలిచిపోతారు.
ALSO READ : అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ కొడుకు పేరుకి ఇంత అర్థం ఉందా..? 2 భాషల్లో 2 రకాలుగా..?