అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ కొడుకు పేరుకి ఇంత అర్థం ఉందా..? 2 భాషల్లో 2 రకాలుగా..?

Ads

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ మరొక సారి తల్లితండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన ఒక మగ బిడ్డకి జన్మనిచ్చారు అనుష్క శర్మ. ఈ విషయాన్ని ఇవాళ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దాంతో ఎంతో మంది సెలబ్రిటీలు వీరిద్దరికీ కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.

2017 లో వీరి పెళ్లి జరిగింది. 2020 లో వీరు తల్లిదండ్రులు అవుతున్నట్టు ప్రకటించారు. 2020 లో వీరికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు వామిక అని పెట్టారు. కానీ వామికని కెమెరాల ముందుకి తీసుకురారు.

anushka sharma virat kohli son name meaning telugu

ఇప్పుడు అనుష్క శర్మ బయట కనిపించిన తర్వాత చాలా మంది అనుష్క రెండవ బిడ్డతో గర్భవతిగా ఉన్నారు అని అన్నారు. కానీ ఈ విషయం మీద వాళ్లు స్పందించలేదు. అలా అని అధికారికంగా కూడా ప్రకటించలేదు. కొన్ని రోజుల క్రితం ఏబి డివిలియర్స్ ఈ విషయం మీద మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వ్యక్తిగత పనిలో బిజీగా ఉన్నారు అని, వారు రెండవ బిడ్డకి జన్మనివ్వబోతున్నారు అని చెప్పారు.

anushka sharma virat kohli son name meaning telugu

Ads

కానీ తర్వాత తాను పొరపాటుగా చెప్పినట్టు మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే అది నిజం లాగానే అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లండన్ లో ఉన్నారు. అక్కడే అనుష్క శర్మ డెలివరీ కూడా అయినట్టు సమాచారం. అయితే, బాబు పేరు అకాయ్ అని చెప్పారు.  దాంతో ఈ పేరు అర్థం ఏంటి అని అందరూ వెతకడం మొదలు పెట్టారు. అకాయ్ అనేది టర్కిష్ భాషలో ఉన్న ఒక పదం. వెలిగే చంద్రుడు అని ఈ పదం యొక్క అర్థం.

anushka sharma virat kohli son name meaning telugu

హిందీలో అయితే కాయ్ అంటే శరీరం అని అర్థం. హిందీలో చూస్తే భౌతిక శరీరానికంటే గొప్పతనం ఉన్న ఒక వ్యక్తి అని అర్థం వస్తుంది. దాంతో ఈ పదానికి అర్థం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి అర్థవంతమైన పేరు పెట్టారు అంటూ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీని పొగుడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో అత్యధిక సంఖ్యలో వెతికిన పేరు కూడా ఇదే అని అంటున్నారు.

ALSO READ : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?

Previous article9 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమాకి… ఇప్పుడు సీక్వెల్..! ఈ సినిమా చూశారా..?
Next articleయాత్ర-2 సినిమా అయిపోయాక… హీరో “జీవా” లో ఈ మార్పు గమనించారా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.