శివుడి పార్వతీ దేవుడికి స్వయంగా చెప్పిన ”శివరాత్రి కథ”… అందుకే ఉపవాసం, జాగరణ, బిల్వపూజ ముఖ్యం..!

Ads

శివరాత్రి నాడు శివాలయాలని అందంగా అలంకరించి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. నిజానికి శివరాత్రి వ్రతం ఎంతో ఉత్తమమైన వ్రతం. అలానే శివరాత్రి నాడు ఆచరించాల్సిన పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. ఉపవాసం చేయడం, జాగరణ, బిల్వపత్రాలతో పూజ చేయడం ఇవన్నీ కూడా ఎంతో మంచి చేస్తాయి. అయితే ఈ రోజు ఉత్తమమైన శివరాత్రి వ్రతం గురించి చూద్దాం.

మాఘ బహుళ చతుర్థి రోజున ఈ వ్రతం చేయాలి ఈ వ్రతం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా యమదండన నుండి తప్పించుకోవచ్చు. ఇక ఈ వ్రతం గురించి చూసేద్దాం.

శివుడి పార్వతీ దేవుడికి స్వయంగా చెప్పిన శివరాత్రి కథ:

పార్వతి దేవి కి శివుడు ఈ విధంగా చెబుతాడు.. ఒకప్పుడు పర్వత ప్రాంతంలో వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు ప్రతిరోజు వేటకు వెళ్లి సాయంత్రం లోపు ఏదో ఒక జంతువును చంపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఓ నాడు ఎంత వెతికినా జంతువు కనపడలేదు తాను బయలుదేరిన వేళ బాలేదని కాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక వాగు కనిపించగానే అతనికి ఆలోచన వచ్చింది… నీరు తాగడానికి జంతువులు వస్తాయని పక్కనే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు.

ఆ తర్వాత చూపులకి అడ్డు వచ్చిన ఆకులని కాయలని విరిచి కింద పడేసాడు. చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. అప్పుడు వేటగాడు వణుకుతూ శివ శివ అని విల్లు ఎక్కుపెట్టి జంతువుల కోసం చూస్తున్నాడు అప్పుడు తెల్లవారేసరికి ఒక జింక కనపడింది వెంటనే జింక మీదకి బాణాన్ని ఎక్కుపెట్టాడు. జింక అది చూసి నన్ను చంపకు అని మనిషిలాగ మాట్లాడింది. దీనితో ఆ వేటగాడు ఆశ్చర్యపోయి మనిషిలా మాట్లాడుతున్నావ్ ఏంటి ఎవరు నువ్వు అని అడిగాడు..?

Ads

దీనికి ఆ లేడి ”నేను పూర్వజన్మలో రంభని అని చెప్పింది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడి పూజని పక్కన పెట్టేసాను అప్పుడు ఆ శాపం నుండి ఇప్పుడు విముక్తి లభించిందని అంటుంది”. తర్వాత మళ్లీ ఇంకో జింక వస్తుంది దాని మీద కూడా బాణం వేయబోతాడు కానీ అది కూడా మనిషిలా మాట్లాడుతుంది. నేను చనిపోయినా మీ కుటుంబానికి చాలాను ఇంకో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది దాన్ని చంపు లేకపోతే నేను తిరిగి వస్తాను అని వేటగాడికి చెప్తుంది. అప్పుడు ఆ వేటగాడు దాన్ని వదిలేస్తాడు.

అలా నాలుగు జింకలు వేటగాడిని వేడుకుని వెళ్లిపోతాయి ఇంకో జింక కోసం ఆశతో చూస్తాడు వ్యాధుడు. తర్వాత రోజు నాలుగు జింకలు వచ్చి ముందు నన్ను చంపు అని వేటగాడు ముందు మోకరిల్లాయి. ఆ జింకలు నిజాయితీకి ఆశ్చర్యపోయి వేటగాడు ఇకమీదట హింస చేయనని విల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆకాశం నుండి పూల వర్షం కురుస్తుంది.

శివరాత్రి సందర్భంగా ఉపవాసం జాగరణ చేయడం అలానే రాత్రంతా వేటగాడు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం అవడం… అయితే అక్కడ ఆకులు కింద పడేసాడు కదా వేటగాడు ఆ అవి కింద పడిన చోట శివలింగం ఉంటుంది ఇవన్నీ కూడా వేటగాడికి కలిసొస్తాయి తెలియకుండా శివలింగాన్ని వేటగాడు పూజించడం వలన పాపం పోయింది. అందుకనే శివరాత్రి నాడు జాగరణ చెయ్యడం, ఉపవాసం చెయ్యడం బిల్వపత్రాలతో పూజ చేయడం ఎంతో పుణ్యం.

Previous articleపరమశివుడి పూజలో సింధూరం, పసుపు ఎందుకు ఉపయోగించరో తెలుసా?
Next articleDhanush Sir movie review: ధనుష్ ”సార్” సినిమా హిట్టా..? ఫట్టా..?