”రావణుడి” శవాన్ని చూసిన మండోదరి చెప్పిన మాటలివి.. రావణుడి మరణానికి అసలు కారణం ఇదే..!

Ads

రావణుడు గురించి మనం చాలానే విన్నాం. రావణాసురుడి భార్య మహా పతివ్రత మండోదరి. ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమె విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కూతురు. ఈమెని మోహించి రావణాసురుడు పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి ఇంద్రజిత్తు పుట్టారు. మండోదరి తన తండ్రి తో ఓ నాడు వనంలో వెళ్తున్నప్పుడు రావణుడు ఈమెని చూస్తాడు. అయితే రావణుడికి పెళ్లి కాలేదు. దానితో మండోదరిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు.

తర్వాత వీళ్ళ పెళ్లి జరుగుతుంది. అయితే ఏ భార్య కూడా భర్త మరణం చూడలేదు. తట్టుకోలేని శోకంలో మునిగిపోతుంది.

Ads

అయితే రావణుడు సీతా దేవిని అపహరించినప్పటి నుండి కూడా ఏదో ఒక రోజు రావణుడికి కీడు జరుగుతుందని మండోదరికి తెలుసు. సీతను తీసుకురావడం కూడా ధర్మం కాదని చెప్తూ ఉండేది. రాముడు చేతిలో ఆఖరికి రావణాసుడు చనిపోతాడు. అప్పుడు యుద్ధభూమికి మండోదరి వస్తుంది. ఆమె అక్కడకి వచ్చినప్పటికి రావణుడి దేహానికి దగ్గర రామలక్ష్మణులు ఉంటారు. వారి పక్కన విభీషణుడు నిలబడి ఉంటాడు. అయితే భర్తను చంపితే ఏ భార్యకి అయినా సరే కోపం వస్తుంది. కానీ మండోదరికి మాత్రం ఏ కోపం రాలేదు. మండోదరి యుద్ధ భూమి దగ్గరికి వెళ్లి అక్కడ పల్లకి దిగి రాముడి మీద ఆగ్రహం చూపలేదు. అలా అని నిన్ను ఎవరు చంపారు అంటూ కోపంతో మండోదరి మండిపడలేదు.

రావణుడి దగ్గరికి వెళ్లి నిన్ను చంపింది నీ ఇంద్రియాలు. రావణుడిని రాముడు చంపారని అనుకుంటున్నారంతా కానీ నిన్ను నీ ఇంద్రియాలు చంపాయి అని అంటుంది. తపస్సు చేసుకునే సమయంలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని కోరికలను జయించావు. అయితే సీతమ్మని చూసాక మాత్రం ఇంద్రియాలు అదుపులో లేవు. ఆనాడు నీ ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకుంటే ఈ పరిస్థితే వచ్చి ఉండేదే కాదు. నిన్ను చంపింది రాముడు కాదు అని అంటుంది. అలానే నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి అంటుంది.

Previous article“చైనా” వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడరో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!
Next articleపెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా ఉన్న.. 10 మంది ప్రముఖులు..!