పెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా ఉన్న.. 10 మంది ప్రముఖులు..!

Ads

ఫేమస్ అయిన కొంత మంది సింగిల్ గానే ఉండిపోయారు. రతన్ టాటా మొదలు అబ్దుల్ కలాం, జయ లలిత, ప్రభాస్ ఇలా చాలా మంది సింగిల్ గా ఉండిపోయారు. పెళ్లి చేసుకోలేదు. మరి అలా ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళ జాబితా ఇప్పుడు తెలుసుకుందాం..

రతన్ టాటా:

రతన్ టాటా సింగిల్ గానే ఉండిపోయారు. పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పుడు రతన్ టాటా ఆనందంగా ఉండేవారు. అయితే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది హేళన చేయడం మొదలు పెట్టారట. పెద్దయిన తర్వాత ప్రేమలో కూడా పడ్డారు కానీ ఆమెని పెళ్లి చేసుకోవడంలో విఫలమయ్యారు. చాలా సార్లు పెళ్లి వరకు వెళ్లారు కానీ ఎంత దగ్గరికి వెళ్తే అంత దూరంగా మళ్ళీ వచ్చేసేవారు ఇలా రతన్ టాటా ఒంటరిగానే మిగిలిపోయారు.

లతా మంగేష్కర్:

లతా మంగేష్కర్ కూడా పెళ్లి చేసుకోలేదు ఆమె కూడా సింగిల్ గా ఉండిపోయారు. ఒక సారి ఆమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ మొదట మనం ఆనందాన్ని వెతుక్కోవాలని పెళ్లి లేదా పిల్లల ద్వారా మాత్రమే నెరవేరాలన్న కల కి ప్రాధాన్యత లేకుండా ఉంటుందని లతా మంగేష్కర్ ఒకసారి చెప్పారు.

అబ్దుల్ కలాం:

అబ్దుల్ కలాం కూడా సింగిల్ గా ఉండిపోయారు ఆయన కూడా రిలేషన్షిప్ లోకి వెళ్ళలేదు అబ్దుల్ కలాం కి డీప్ ఫ్రెండ్షిప్ కూడా ఇష్టం లేదు. ఆయన రచనల ద్వారా కూడా ఆయన ఒంటరిగా ఉండాలని చెప్పుకొచ్చారు అబ్దుల్ కలాం.

జయలలిత:

జయలలిత కూడా పెళ్లి చేసుకోలేదు చాలాసార్లు పెళ్లి వరకు ఆమె వెళ్లారు కానీ ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోవడం అవ్వలేదు. ఒంటరిగానే ఆమె మిగిలిపోయారు.

రాహుల్ గాంధీ:

Ads

ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ తల్లిదండ్రులు చక్కటి వివాహాన్ని చేసుకున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. కానీ ఆయన జీవితంలోకి అంత మంచి అమ్మాయి సరైన అమ్మాయి రాలేదని అలాంటి అమ్మాయి వస్తే పెళ్లి చేసుకుంటారని ఒకసారి రాహుల్ గాంధీ అన్నారు.

ప్రభాస్:

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో తన పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నారు ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన వార్తలు చాలాసార్లు వచ్చాయి. అయితే ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఇంకా నా రాత లో వ్రాసి లేదు అని ప్రభాస్ చాలాసార్లు చెప్పారు.

సల్మాన్ ఖాన్:

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి చేసుకోలేదు అయితే పెళ్లి అంటే డబ్బులు వృధా అని సల్మాన్ ఖాన్ ఒకసారి చెప్పారు. పైగా ప్రేమ మీద నమ్మకం లేదని కూడా చెప్పారు. సింగిల్ గానే సల్మాన్ ఖాన్ కూడా ఉండిపోయారు.

అనుష్క శెట్టి:

అనుష్క శెట్టి కూడా పెళ్లి ఇంకా చేసుకోలేదు. ఆమె పెళ్లి గురించి కూడా ఎన్నో రూమర్స్ చాలా సార్లు వచ్చాయి ఆమె ఇంకా సింగిల్ గా ఉన్నారు పెళ్లి గురించి ఆమె పబ్లిక్ గా ఎప్పుడూ చెప్పలేదు.

టబు:

ఈమె కూడా ఒంటరిగానే మిగిలిపోయారు సరైన జీవిత భాగస్వామి రాకపోవడం కంటే ఒంటరిగా ఉండడం మంచిదని టబు అనుకుంటారు అందుకనే ఆమె ఒంటరిగా ఉండిపోయారు.

త్రిష:

త్రిష ని అర్థం చేసుకునే వ్యక్తి తన జీవితంలోకి వస్తేనే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నారు పైగా ఒంటరిగా జీవితంలో ఉండడం వలన తనకి నష్టం లేదని కూడా చెప్పారు త్రిష. ఇలా త్రిష కూడా సింగిల్ గా ఉండిపోయారు.

Previous articleఎక్కువ మంది మన దేశంలో చెప్పే అబద్ధాలు ఏవో.. తెలుసా..?
Next articleదర్శకుడు తేజ: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ… కానీ ఏమి తెలీనట్టు అలా…!