Ads
మనో గురించి కొత్తగా మనం చెప్పక్కర్లేదు మనో అందరికీ సుపరిచితమే. నేపథ్య గాయకుడిగా, డబ్బింగ్ కళాకారుడుగా, నటుడుగా మను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలానే సంగీత దర్శకుడుగా నిర్మాతగా కూడా మనం పని చేశారు మనో. ఇటు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకు పైగా పాటలని పాడారు మనో.
మనో అసలు పేరు నాగూర్ బాబు కానీ మనందరికీ మనోగానే తెలుసు. ఈయన సత్తెనపల్లి లోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆయన పేరుని ఇళయరాజాయే మార్చారు.
గాయకుడిగా మనకి తెలియక ముందే నీడ అనే ఒక సినిమాలో బాల నటుడిగా నటించాడు. ఈ మధ్య మనో కామెడీ షోలలో కూడా కనపడుతున్నారు. మనో ఇంటర్వ్యూ ద్వారా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇందులో ఆయన పాట కి ఎంత తీసుకుంటారు అనే దాని గురించి కూడా ప్రస్తావించారు. మరి ఒక పాట కి ఎంత రెమ్యూనరేషన్ మనో తీసుకుంటారో తెలుసా..? మనో ఒక పాటకి ఎంత తీసుకుంటారు అనేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఉత్తర భారత దేశంలో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో సింగర్స్ కి పేమెంట్ తక్కువగా ఇస్తారని మనో చెప్పారు.
Ads
కానీ నిజానికి సింగర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారేమో అని బయట చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. హిందీ సినిమాలతో పోల్చుకుంటే ఇక్కడ బాగా తక్కువ వస్తుందని అక్కడ లక్ష రూపాయలు పాటకి ఇస్తే ఇక్కడ 5000 రూపాయలు వస్తాయని మనో చెప్పారు. ఐదు పాటలు పాడినట్లయితే లక్ష రూపాయల వరకు వచ్చేస్తుందేమో అని అనుకుంటారని కానీ పాటకి 3000 చొప్పున 5 పాటలు పాడితే 15000 మాత్రమే వస్తాయని మనో చెప్పారు అలానే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్తే ఎన్నో కోట్లు వస్తాయేమో అని ప్రేక్షకులు అనుకుంటారని మనో అన్నారు.