కాలం అన్నిటి కంటే ఎంతో ముఖ్యమైనది. ఒకసారి కాలం వెళ్లిపోతే మళ్ళీ తిరిగి రాదు అందుకని కాలం ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి. అయిపోయిన క్షణాలు రావు చాలా మంది సమయాన్ని వృధా చేసుకుని సమయం వృధా అయిపోయిన తర్వాత టైం సరిపోలేదు అని తేలికగా చెప్పేస్తుంటారు.
కానీ సరిగ్గా సమయాన్ని వినియోగించుకుంటూ సమయానికి పనులు చేసుకుంటే ఖచ్చితంగా సమయం సరిపోతుంది. ఎప్పుడూ కూడా సమయం ముఖ్యమైనదని గుర్తు పెట్టుకుని పనులని వాయిదా వేసుకోకండి.
అయితే కాలం లో 12 అంకె కి ప్రాతన్యత ఎక్కువ. ఎప్పుడైనా 12 అంకె కి ఇంత ప్రాధాన్యత ఉందని మీరు గమనించారా..? మీరు దీనిని చూస్తే ఎంతో వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. పైగా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. 12 కి ప్రాధాన్యత ఏమిటి..? ప్రతి అంకె కి కూడా ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది కదా..? అలానే 12 కి కూడా మామూలుగానే ఉంటుంది.
ఏదో చిన్న చిన్న ప్రాముఖ్యతలు 12 అంకె కి కూడా ఉంటాయి ఇందులో పెద్ద విశేషం ఏముంది అని అనుకోవద్దు. 12 కి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మరి ఇక ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా మనం 12 అంకెకి ఉన్న ప్రాధాన్యత గురించి చూద్దాం.
12 అంకెకి ఉన్న ప్రాధాన్యత:
1/2 * 12 = 6 ఏడాది లో ఆరు ఋతువులు
1 * 12 = 12 మనకి వున్న నెలలు పన్నెండు.
2 * 12 = 24 రోజుకి ఇరవై నాలుగు గంటలు. ఉదయము నుండి అస్తమయం దాకా పన్నెండు గంటలు. ఆ తరవాత నుండి పన్నెండు.
3 * 12 = 36 సంవత్సరములో ముఖ్య పర్వ దినాలు.
4 * 12 = 48 12 శుద్ద ఏకాదశులు, 12 బహుళ ఏకాదశులు, 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు ఇలా మొత్తం నలభై ఎనిమిది ఏడాదికి.
5 * 12 = 60 షష్టి పూర్తి చేసుకోవలసిన వయస్సు.
6 * 12 = 72 వ్యక్తి సప్తతి పూర్తి కాలము ఇది.
7 * 12 = 84 సహస్ర చంద్రులని చూడడానికి గుర్తుగా చేసుకునే ఉత్సవ కాలము ఇది.
8 * 12 = 96 శతమానోత్సవము. నూరేళ్లు ఉంటే చేసుకోవలసింది.
9 * 12 = 108 ఆధ్యాత్మిక ఉన్నతులు జీవించే కాలము ఇది.
10 * 12 =120 వ్యక్తి ఉండే పూర్ణ ఆయుష్య కాలము జ్యోతిషం ప్రకారము నూట ఇరవై ఏళ్ళు. ఇలా పన్నెండుకు ఇంత ప్రాధాన్యత ఉంది.