ఈ గొడవలోకి చిరంజీవిని ఎందుకు లాగారు..? అసలు చిరంజీవి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..?

Ads

ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ మన్సూర్‌ అలీఖాన్‌ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పై మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేయడంతో అతని పె విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలిచారు.

మన్సూర్‌ అలీఖాన్‌ మూడు రోజుల క్రిందట త్రిషకు క్షమాపణలు చెప్పడం, త్రిష కూడా ‘తప్పులు చేయడం మానవ సహజం, వాటిని క్షమించడమే చాలా గొప్ప విషయం’ అని పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం ముగిసిందని అనుకున్నారు. అయితే మన్సూర్‌ అలీఖాన్‌ ఈ వివాదాన్ని మళ్ళీ రగిలేలా చేస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ads

మన్సూర్‌ అలీఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష పై అసభ్యకర కామెంట్లు చేయడంతో వైరల్ గా మారాయి. అతని కామెంట్స్ ను ఖండిస్తూ, ఇలాంటి వ్యక్తితో ఇక పై నటించనని త్రిష కూడా తెలిపింది. మన్సూర్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, త్రిషకు మద్ధతుగా తమిళ, తెలుగు సినీ ప్రముఖులు స్పందించారు.
నటి కుష్బూ స్పందించింది. ఆమె జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్ కూడా. మన్సూర్ అలీఖాన్ పై జాతీయ మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు మద్ధతు తెలుపుతూ,  మన్సూర్‌‌ ది వక్రబుద్ది అంటూ పోస్ట్ చేశారు. మొదట సారీ చెప్పనన్న మన్సూర్ అన్ని రకాలుగా ఒత్తిళ్లు రావడంతో ఫైనల్ గా త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ఆమె కూడా క్షమించినట్టుగా పోస్ట్ పెట్టింది. అంతా ఈ కాంట్రవర్సీ ముగిసిందని భావించారు.
కానీ మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషతో పాటు ఆమెకు మద్ధతు తెలిపిన ఖుష్బు, మెగాస్టార్ చిరంజీవి లపై పరువు నష్టందావా వేశాడు. అంతేకాకుండా నవంబర్‌ 27న కోర్టులో క్రిమినల్‌ కేసు సైతం వేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ముగ్గురికి నోటీసులు కూడా జారీ చేస్తానన్నాడు. త్రిష పై తాను చేసిన కామెంట్స్ ను  వక్రీకరించారని, త్రిష, ఖుష్బూ, చిరంజీవి తదితరులు అవనసరంగా తనను విమర్శించారని, వారి మాటలు మానసికంగా బాధించాయంటున్నారు. అందువల్లే ఈ విషయమై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపాడు.

Also Read: గూఢచారి 2 లో హీరోయిన్ ఈమెనే…చూడడానికి శోభిత ధూళిపాళ్లలానే ఉందిగా..! ఎవరంటే.?

Previous articleభారతీయ క్రికెటర్లని అగౌరవపరిచేలా ఈ పోస్ట్ ఏంటి..? ఒక్క కాన్పులో 11 మంది అంటూ..?
Next articleసెంచరీ హీరోని సింగిల్ డిజిట్ కే అవుట్ చేశాడు..! ఈ తెలుగు తేజం ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.