సెంచరీ హీరోని సింగిల్ డిజిట్ కే అవుట్ చేశాడు..! ఈ తెలుగు తేజం ఎవరో తెలుసా..?

ప్రపంచ కప్‌ ఫైనల్ పరాజయంతో బాధలో మునిగిన అభిమానులను బయటపడేసేందుకు భారత జట్టు టీ20 సిరీస్ లో విశ్వరూపం చూపిస్తోంది. వరల్డ్ కప్ ఆశలను గల్లంతు చేసిన ఆస్ట్రేలియా పై అద్భుతంగా ఆడుతోంది.

టీ20 సిరీస్ లో వరుసగా టీంఇండియా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఆసీస్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అంతకుముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్ ని 2 రన్స్ కి అవుట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆదివారం (నవంబర్‌ 26) నాడు తిరువనంతపురం వేదికగా ఆసీస్ తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో  భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా. ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్ కి దిగింది. టీమిండియా బ్యాటర్లు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఆ తరువాత 236 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టు 35 రన్స్ కి  మాథ్యు షాట్ (19) అవుట్ అయ్యాడు. ఆ తరువాత మొదటి టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చేసిన జోష్ ఇంగ్లీస్ అవుట్ అయ్యాడు.
ఐదో ఓవర్ లో రవి బిష్ణోయ్ వేసిన రెండవ బాల్ కి జోష్ ఇంగ్లీస్ మిడాన్ పైగా భారీ షాట్ కు  ప్రయత్నించగా, ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ వెనక్కి పరిగెత్తుతూ వెళ్ళి, అద్భుతంగా బంతిని క్యాచ్  పట్టుకున్నాడు. ఆ క్రమంలో తిలక్ వర్మ పడిపోయాడు. కానీ బంతిని నేలకు టచ్ కాకుండా నియంత్రించాడు. ఆ క్యాచ్ తో జోష్ ఇంగ్లీస్ అవుట్ అయ్యాడు. అయితే గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన  జోష్, ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతమైన ఫీల్డింగ్ కు రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
39 పరుగులకే ఆస్ట్రేలియా రెండవ వికెట్ కోల్పోయింది. కీలకమైన ప్లేయర్ జోష్ ఇంగ్లీస్ అవుట్ అవడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ప్రస్తుతం తిలక్ వర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌కు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. తిలక్ వర్మ పై క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IPL 2024: ఈసారి IPL లో చేయబోతున్న భారీ మార్పులు ఇవే..!

Previous articleఈ గొడవలోకి చిరంజీవిని ఎందుకు లాగారు..? అసలు చిరంజీవి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..?
Next article“రామ్ చరణ్-లియో” కేమియో వార్త లాగానే… ప్రేక్షకులని మోసం చేసిన 8 హీరోల “గెస్ట్ రోల్” వార్తలు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.