Ads
ఒకప్పుడు తండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేటప్పుడే వాళ్లకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేసేవారు. అలాంటి ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో వాటాలు ఉండేవి కావు. తర్వాత వచ్చిన చట్టాల ప్రకారం ఆడపిల్లలకి పెళ్లయినప్పటికీ తండ్రి ఆస్తిలో వాటాలు సంక్రమిస్తాయి అని చట్టం వచ్చిన దగ్గరనుంచి చాలామందికి ఆస్తి తగాదాలు ప్రారంభమయ్యాయి. అసలు పెళ్లయిన కూతురికి తండ్రి ఆస్తిలో ఎలాంటి హక్కులు ఉంటాయో చూద్దాం.
ఒక తండ్రి తాను స్వయంగా సంపాదించిన ఆస్తికి ఆడపిల్లలకి కూడా వాటాలు ఉంటాయి. ఆడపిల్లకి పెళ్లి అయినప్పటికీ కూడా ఆస్తి లో హక్కులు సంక్రమిస్తాయి. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 ప్రకారం తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిలో కుమారుడికి సమాన హక్కు ఉన్నట్టే కుమార్తెకు కూడా సమాన హక్కుఉంటుంది. ఆడపిల్లకి పెళ్లి అయినప్పటికీ కూడా ఈ హక్కు వర్తిస్తుంది. ఒకవేళ తండ్రి వీలునామ రాయని పక్షంలో క్లాస్ 1 లీగల్ వారసులుగా పరిగణించబడి, ప్రత్యక్ష వారసులు లింగం తో సంబంధం లేకుండా తండ్రి స్వీయ సంపాదనలో సమాన వాటా కలిగి ఉంటారు.
Ads
ఒకవేళ తండ్రి తాను సంపాదించిన ఆస్తిని వేరొకరికి వీలునామా రాసి ఉంటే అప్పుడు ఆమె దానిలో వాటాని పొందలేరు. నిజానికి వీలునామా రాయటం అనేది పిల్లల భవిష్యత్తుకి ఎంతో మంచిది. లేని పక్షంలో ఆస్తి కోసం కుటుంబ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరు తండ్రులు జీవించి ఉన్నప్పుడే వారి ఆస్తులను పిల్లలకు బహుమతిగా ఇవ్వటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలు వారసులుగా ఉన్నప్పుడు ఆ తల్లులు బ్రతికి ఉండగానే ఇల్లు, భూమి నగదు తదితర బహుమతులు ఇస్తారు.
అలాగే విడాకులు తీసుకున్న ఒక మహిళ మాజీ భర్త సొంత ఆస్తిలో తన కుమారుడికి వాటా ఉంటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది.వారసత్వ చట్టం ప్రకారం ప్రత్యక్ష వారసులందరికీ స్థానిక ఆస్తిలో వాటా ఉంటుంది. విడాకులు తీసుకున్న మాజీ భర్త మరొక మహిళను పెళ్లి చేసుకుని సంతానం కలిగిన కూడా ఈ మహిళ కొడుకు స్థానిక ఆస్తికి అర్హులుగా ఉంటారు.