Ads
గర్భం దాల్చడానికి, ప్రేమకు ప్రతిరూపాలైన పిల్లలను లోకం లోకి తీసుకురావడానికి పెళ్లైన ప్రతి అమ్మాయి ఎంతగానో ఆశపడుతుంది. గర్భం దాల్చిన తరువాత ఆమె సంతోషాలకు హద్దే ఉండదు. అయితే.. బిడ్డ పుట్టేవరకు ప్రతి అమ్మాయి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తనకి ఇష్టమైనా స్పైసీ ఫుడ్ తినడం మానేస్తుంది. కొన్ని ఆహార పదార్ధాలను దూరం పెడుతుంది. ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే ఫాలో అవుతూ ఉంటుంది.
చివరకు.. ఐదవ నెల వచ్చిన తరువాత ఆ అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. ఐదవ నెల వచ్చిన తరువాత గర్భవతులు గుడికి వెళ్లకూడదని చెబుతుంటారు. అలాగే.. పూజలు కూడా చేయకూడదని చెబుతారు. ఇదంతా మూఢనమ్మకాలు అని కొట్టిపడేయడానికి లేదు.
Ads
దీని వెనుక అసలు శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి గుడికి వెళ్లినా.. పూజలు చేసిన మనలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. ఈ వైబ్రేషన్స్ ను తట్టుకునే శక్తీ గర్భంలోని పిండానికి ఉండదు. ఐదవ నెల వచ్చేసరికి పిండం రూపు సంతరించుకుంటూ ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ తట్టుకునే పరిస్థితి పిండానికి ఉండదు.
ఇంకా చాలా మంది ఏడవ నెల బంప్ వచ్చాక ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటారు. నిజానికి ఇది కూడా పుట్టబోయే బిడ్డకి మంచిది కాదట. ఐదవ నెల దాటాక బేబీకి బేసిక్ అవయవాలు ఏర్పడతాయి. కొంతమందిలో ఐదవ నెల దాటి ఆరవ నేలలోకి వచ్చేసరికి కదలికలు కూడా వచ్చేస్తాయి. అయితే.. ఇలాంటి సమయంలో పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా వైబ్రేషన్స్ కు పిండాన్ని గురి చేయడం అంత మంచిది కాదు. అందుకే ఐదవ నెల దాటినా తరువాత గుడికి వెళ్లడం కానీ, పూజలు చేయడం కానీ, ఫోటోషూట్ తీయించుకోవడం కానీ మంచిది కాదని చెబుతుంటారు.