తెలుగులో ముగ్గురు అక్క చెల్లెళ్ళతో నటించిన ఒకే ఒక స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వారుండరు.మూడు ద‌శాబ్దాలుగా టాప్ ప్లేస్ లో కొన‌సాగుతున్నాడు. ఆయన తన చిత్రాల ద్వారా ఆడియెన్స్ అలరించిన విధానం సెన్సేషన్ అని చెప్పాలి.

మెగాస్టార్ తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇంకో వైపు దాస‌రి నారాయ‌ణ‌రావు తరువాత ఇండస్ట్రీకి అండ‌గా ఉంటున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ త‌న కెరీర్‌లో కొన్ని అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు. వాటిలో ఒకటి ముగ్గురు అక్కాచెల్లెల్లు అయిన హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాడు. మరి ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం రండి..న‌గ్మా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఘ‌రానా మొగుడు. టాలీవుడ్ లో ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డుల‌ను బ్రేక్ చేసింది . ఈ సినిమాలో న‌గ్మా హీరోయిన గా నటించింది. ఇక ఈసినిమాలో చిరంజీవి నగ్మా మధ్య వచ్చే సన్నివేశాలు, న‌గ్మా పై మెగాస్టార్ వేసే పంచ్‌లు, ఇద్దరు ఒక‌రి పై ఒకరు చేసే ఛాలెంజ్‌లు మూవీ రేంజ్‌ను అమాంతం పెంచాయి.ఈ మూవీ చిరంజీవితో పాటు న‌గ్మా కెరీర్‌లో ఈ మూవీ ప్ర‌త్యేకంగా నిలిచింది.

Ads

రోషిణి
హీరోయిన్ నగ్మా సోద‌రి రోషిణి. అయితే రోషిణి తెలుగులో త‌క్కువ చిత్రాలలోనే నటించింది. ఆమె మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించింది. ఈ చిత్రంలో రోషిణి ప్లాష్ బ్యాక్ స్టోరీ లో కనిపిస్తుంది. ఈ సినిమాతో రోషిణికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మాస్టర్ మూవీ చిరంజీవి కెరీర్ కు కూడా ప్లస్ అయింది.

జ్యోతిక
హీరోయిన్ నగ్మాకు ఉన్న ఇంకొక సోదరి జ్యోతిక. ఇక జ్యోతిక తెలుగు తమిళ ఆడియెన్స్ కు సుపరిచితమే.ఆమె తెలుగులో చాలా చిత్రాలలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమాలో జ్యోతిక నటించింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెల్ల‌తో మెగాస్టార్ చిరంజీవి రొమాన్స్ చేశాడు.

Also Read: నటుడు సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

Previous article“హాయ్ నాన్న” ఆ తెలుగు సినిమా రీమేకా.? టీజర్ చూస్తే… ఆ “నాగార్జున” సినిమా స్టోరీ లాగా అనిపిస్తుందిగా.?
Next article“గుప్పెడంత మనసు” లో సరికొత్త ట్విస్ట్…మహేంద్రను కలసిన ఆ కొత్త వ్యక్తి ఎవరు?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.