Ads
యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వినూత్నమైన కాన్సెప్ట్ తో కొత్త డైరెక్టర్ మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తో ఎప్పుడు ఇప్పుడే కామెడీ చిత్రాలతో పాపులర్ అవుతున్న జాతిరత్నం ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా పెట్టి ధైర్యంగా తీసిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ రేంజ్ లో మెప్పించిందో తెలుసుకుందాం..
- చిత్రం: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- నటీనటులు: అనుష్క,నవీన్ పొలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ ,నాజర్.
- రచన & దర్శకత్వం: మహేష్ బాబు పి.
- నిర్మాత: వంశీ, ప్రమోద్
- సినిమాటోగ్రఫి: నీరవ్ షా
- సంగీతం: రధన్
- విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2023
కథ:
అన్విత (అనుష్క) లండన్ లో ఒక ప్రసిద్ధ చెఫ్ గా తన జీవనాన్ని గడుపుతోంది.. పెళ్లి సంసారం ఇలాంటి వాటికి దూరంగా తన ఒంటరి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అనుకునే అన్విత..తన తల్లి మరణించిన తర్వాత ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి అనుకున్న అన్విత ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఒక బిడ్డని కనాలి అని భావిస్తుంది. అయితే ఈ పని కోసం తనకు కావలసిన లక్షణాలు ఉన్న వ్యక్తిని వెతకడం కోసం లండన్ నుంచి అన్విత ఇండియా చేరుకుంటుంది.
ఆమె అన్వేషణలో తనకు కావలసిన క్వాలిటీస్ తో ఉన్న స్టాండ్ అప్ కమెడియన్ సిద్దు (నవీన్ పోలిశెట్టి)ని కలవడం జరుగుతుంది. అయితే అనుష్క చెప్పిన వెర్రి ఆలోచనకు సిద్దు షాక్ అవుతాడు.. ఇక అనుష్క సిద్దు ని ఎలా కన్విన్స్ చేస్తుంది, ఫైనల్ గా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది.. అనుష్క దేనికోసం అయితే ఇండియాకి వచ్చిందో ఆ పని పూర్తి చేయగలిగిందా.. తెలియాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మూవీ అన్విత మరియు ఆమె తల్లి మధ్య సెంటిమెంట్ సీన్ తో మొదలవుతుంది. అయితే ఈ ఒక్క భాగాన్ని కాస్త ఫ్లాష్ బ్యాక్ గా చూపించి ఉంటే మరింత బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హీరో క్యారెక్టర్ ఎంటర్ అయిన తరువాత థియేటర్లో ఆ బరువైన అట్మాస్ఫియర్ తగ్గి కాస్త కామెడీ స్టార్ట్ అవుతుంది. అయితే సినిమా మొత్తం స్టాండప్ జోకులతో ఎంతో ఆహ్లాదంగా ఉంది.
Ads
ఫస్ట్ హాఫ్ ఒక మోస్తారు గా ఉన్నప్పటికీ నవీన్ ఫుల్ కామెడీ కొనసాగే 45 నిమిషాలు మూవీని వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ కి తీసుకువెళ్తాయి. అయితే మళ్లీ ఎండింగ్ కి వచ్చే కొద్ది సినిమా కాస్త సాగదీతగా బోరింగ్ మోడ్ లోకి వెళ్లిపోతోంది. అసలు పెళ్లి వద్దు.. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు.. అని భావించి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఒక బిడ్డని కనాలి అనుకున్న అన్విత ఫైనల్ గా ఎందుకు మనసు మార్చుకుంది అనే విషయంపై జస్టిఫికేషన్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.
అనుష్క తన రోల్ కి ఎక్సలెంట్ గా సెట్ అయింది మరోపక్క నవీన్ క్యారెక్టర్రైజేషన్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. ఒకప్పటి నువ్వే కావాలి.. నేనున్నాను లాంటి సినిమాల ఫీల్ మనకు ఈ మూవీలో అక్కడక్కడ కలుగుతుంది. ఈ మూవీ ని ఇటీవల చూసిన చిరంజీవి మొదటి ప్రేక్షకుడిగా ఇచ్చిన రివ్యూ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. మొత్తానికి ఇప్పటివరకు అయితే పర్వాలేదు అనిపించుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి .. కలెక్షన్స్ ఎంతవరకు ఉంటాయి అనేది రేపటికల్లా తేలిపోతుంది. మరోపక్క ఈ మూవీకి గట్టి పోటీ ఇవ్వడానికి షారుక్ జవాన్ సిద్ధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
- ఈ మూవీకి మెయిన్ హైలైట్ అంటే నవీన్ టైమ్లీ కామెడీ అని చెప్పాలి.
- మదర్ డాటర్ సెంటిమెంట్ మూవీకి కాస్త వెయిటేజ్ ఇస్తుంది.
- ఇక అనుష్క యాక్షన్ వేరే లెవెల్ లో ఉంది.
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా ఉంది.
- సెంటిమెంట్ సీన్స్ కాస్త భారీగా ఉన్నాయి కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో చూపించి ఉంటే బాగుండేది.
- మ్యూజిక్ యావరేజ్ గా ఉంది.
- క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది.
రేటింగ్:
2.5/5
చివరి మాట:
ఓవరాల్ గా మూవీ బాగుంది.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల కారణంగా ఫ్యూచర్ జనరేషన్ పెళ్లిపై ఎలా విముఖత పెంచుకుంటారు అనే విషయం ఈ మూవీలో స్పష్టంగా చూడొచ్చు. ఈ మూవీ కామెడీ ,సెంటిమెంట్ ,రొమాంటిక్ స్టోరీ కాబట్టి వీకెండ్ లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.
watch trailer :
ALSO READ : “యాంకర్ సుమ”ని ఇలా ఎప్పుడు చూడలేదు అనుకుంట..? ఇలా మారిపోయావు ఏంటక్కా.?