Jawan Review : “షారుఖ్ ఖాన్” హీరోగా నటించిన జవాన్ ఆకట్టుకుందా..?

Ads

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ చిత్రం జవాన్. షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ కొన్ని కారణాలవల్ల చిత్రం బాగా డిలే అయింది. ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఒకేసారి హిందీతో పాటుగా తమిళ్, తెలుగు భాషల్లో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ మూవీలో నార్త్ స్టార్సే కాదు సౌత్ నుంచి నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం…

 • చిత్రం : జవాన్
 • నటీనటులు : షారూఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే.
 • నిర్మాత : గౌరీ ఖాన్
 • దర్శకత్వం : అట్లీ
 • సంగీతం : అనిరుధ్ రవిచందర్
 • విడుదల తేదీ : సెప్టెంబర్ 7, 2023

jawan review

స్టోరీ :

దేశం కోసం ప్రజల కోసం సేవ చేయాలి అనుకునే ఒక జవాన్ విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్), కొన్ని అనివార్య కారణాలవల్ల అందరికీ దూరంగా అజ్ఞాతంలో బతుకుతుంటారు. అతని భార్య (దీపికా పదుకొనే), కొడుకు ఆజాద్ రాథోడ్ (ఇంకొక షారుఖ్ ఖాన్) కూడా అతనికి దూరంగానే ఉంటారు. పెద్దయి పోలీస్ ఆఫీసర్ అయిన ఆజాద్ రాథోడ్ అచ్చు తండ్రి పోలికలతో ఉండడం వల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు.

jawan review

తన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు అని గ్రహించి…సంవత్సరాలుగా ఉన్న అజ్ఞాతవాసాన్ని వదిలి విక్రమ్ బయటికి వస్తాడు. ఆ తర్వాత తన కొడుకుని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు? తన కొడుకు చుట్టూ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాడు? అసలు ఎందుకు అతను అజ్ఞాతంలో ఉన్నాడు? ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? తెలియాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.

jawan review

విశ్లేషణ:

డైరెక్టర్ అట్లీ , ఇప్పటివరకు చేసినవి కొన్ని సినిమాలే కానీ అతని ప్రతి సినిమాలో ఒక స్పెషాలిటీ మాత్రం కచ్చితంగా ఉంటుంది. అతను చేసిన నాలుగు సినిమాల్లో మూడుకు పైగా విజయ్ సేతుపతి తోనే చేశాడు.. అవి తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్షాతో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో తీసిన జవాన్ చిత్రం అతని డైరెక్షన్ కి ఒక మైలురాయిగా మిగిలిపోతుంది.

Ads

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న షారుఖ్ ఖాన్ గుండు గెటప్ మరియు ట్రైన్ లో అతను వేసిన డాన్స్ బిట్ చిత్రంపై అంచనాలను చాలా పెంచింది. ట్రైలర్ లోనే కథ ఆల్మోస్ట్ అర్థం అయిపోయే విధంగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు ఏమవుతుందో సులభంగా గెస్ చేయవచ్చు. సౌత్ వాళ్లకు ఈ టైప్ చిత్రాలు కామన్ కానీ నార్త్ లో ఈ మూవీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

jawan review

కథలో టీం గా ఉన్న టేకింగ్ ఎక్సలెంట్ గా ఉంది. అందుకే స్టోరీ అర్థమయిపోయినా ..క్లైమాక్స్ ఊహించగలిగినా…సినిమా ఎండ్ వరకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకులలో కలుగుతుంది. పేరుకు ఇది బాలీవుడ్ చిత్రమే కానీ ఇందులో సగం పైగా తెలుగు తమిళ్ స్టార్స్ కనిపిస్తారు కాబట్టి లోకల్ డబ్బింగ్ వర్షన్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. షారుఖ్ ఖాన్ యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్ అయితే దీపికా మూవీకి మెయిన్ పిల్లర్. మరీ ముఖ్యంగా వాన పడుతూ ఉంటే ఎర్ర చీరలో అందంగా దీపిక అవలీలగా షారుక్ ను ఎత్తి కింద పడేసే సీన్ సూపర్ గా ఉంటుంది.

jawan review

నయనతార క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ లేకపోయినా మూవీలో ముఖ్యమైన పాత్ర అని చెప్పవచ్చు. ఆమెకు ఇచ్చిన పరిధి మేరకు నయనతార ఎక్స్లెంట్ గా నటించింది. ఇందులో హీరోయిన్లు ఉన్నా పెద్దగా కనిపించరు .. నిజానికి హీరోయిన్ దీపికాది కూడా ఇందులో ఒక ఎక్స్టెండెడ్ కేమియో అని అనుకోవచ్చు. మెయిన్ గా ఈ మూవీలో ప్రధానమైన పాత్రలు అంటే ఒకటి సారు రెండు విజయ్ సేతుపతి. హిందీ నేర్చుకొని మరి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విజయ్ నటన పట్ల తనకు ఉన్న డేడికేషన్ మరొకసారి నిరూపించుకున్నారు.

ప్లస్ పాయింట్స్ :

 • ఈ చిత్రానికి నటీనటులే పెద్ద ప్లస్ పాయింట్.
 • మూవీ నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు.
 • మూవీలో వచ్చే సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ మనసును కదిలించే విధంగా ఉన్నాయి.
 • ఈ మూవీకి మ్యూజిక్ మరొక ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్:

 • స్టోరీ చాలా రొటీన్ గా ,బాగా తెలిసినట్టుగా ఉంటుంది.
 • కాస్త స్టోరీ చూడగానే ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ చేసేయవచ్చు.

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

మంచి ఊర మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రం చూడాలి అనుకుంటే మీకు ప్రస్తుతం ఉన్న బెస్ట్ ఆప్షన్ జవాన్ మూవీ. షారుఖ్ అభిమానులైతే మాత్రం ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ క్రియేట్ చేసే సీన్స్ తో ఒక్క నిమిషం కూడా కదలకుండా కూర్చోబెట్టగలిగే మూవీ జవాన్.

ALSO READ : Miss Shetty Mr Polishetty Review : “అనుష్క” ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారా..?

Previous articleMiss Shetty Mr Polishetty Review : “అనుష్క” ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారా..?
Next articleపవన్ కళ్యాణ్ ‘బాలు’ మూవీ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.