“యాంకర్ సుమ”ని ఇలా ఎప్పుడు చూడలేదు అనుకుంట..? ఇలా మారిపోయావు ఏంటక్కా.?

Ads

బుల్లితెరపై స్టేజ్ షో అయినా…సినిమా ఆడియో లాంచ్ అయినా ..యాంకర్ గా సుమ అక్క లేకపోతే స్టేజ్ వెలవెల పోవాల్సిందే. వచ్చిన హోస్టుల దగ్గర నుంచి గెస్ట్ ల వరకు తనదైన శైలిలో తికమక పెట్టి ,విచిత్రమైన ప్రశ్నలు అడిగి హల్చల్ చేసే సుమ అక్క స్పెషాలిటీ. అయితే ఈ ఏజ్ బారు స్టేజి యాంకర్.. యంగ్ యాంకర్స్ మాదిరిగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం విచిత్రంగా ఉంది.

స్టేజిపై యాంకరింగ్ చేయడం అంటే సుమక్క ఎంతో రెడీగా ఉంటుంది.. అయితే ఎప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అయ్యే సుమక్క కాస్త గ్లామర్ షో మొదలు పెట్టడం అభిమానులకు కొత్తగా ఉంది. గంటలు గంటలు బోర్ కొట్టకుండా, అనర్గళంగా మాట్లాడి ,అవతలి వాళ్ళ బుర్ర తినేసి ఎంజాయ్ చేసే యాంకర్ సుమ కనకాల. ప్రస్తుతం సుమా చేస్తున్న సుమా అడ్డ ,అమ్మ ఆవకాయ్ సుమ వంటి షో లు బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.

Ads

అంతటితో ఆగకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి తాను చేసే షాపింగ్ దగ్గర నుంచి ఇంట్లో చేసుకునే రకాల వరకు…అన్ని గబగబా మాట్లాడి అందరిని ఎంటర్టైన్ చేస్తుంది సుమ. అయితే ఎప్పుడు తన ఏజ్ కి తగ్గట్టు ఉండే సుమ ప్రస్తుతం లేటెస్ట్ డిజైనర్ ధరించి సూపర్ గ్లామరస్ హీరోయిన్గా దర్శనం ఇవ్వడం తో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

నిజానికి 1996లో నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన సుమ మెల్లిగా .. మలయాళం చిత్రాల్లో హీరోయిన్గా చేసింది.. అయితే అక్కడ ఊహించిన సక్సెస్ రాకపోవడంతో యాంకర్ గా అవతారం ఎత్తింది. అన్నీ కలిసి రావడంతో బుల్లితెరలో తిరుగులేని యాంకర్ గా సెటిల్ అయిపోయింది. పాతిక సంవత్సరాలుగా ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతోంది అంటే సుమ ఏ రేంజ్ లో పాపులర్ ఆలోచించండి.

Previous articleవామ్మో!!! రమ్యకృష్ణ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా.? ఇండస్ట్రీలో చాలామందికి తెలీదు అంట.?
Next articleMiss Shetty Mr Polishetty Review : “అనుష్క” ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.