Ads
తిండి, నీరు, గాలి ఇవన్నీ లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండే ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అందులోనూ ముఖ్యంగా సినిమాలు లేని లోకాన్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సినిమా అంటేనే ఒక ఎమోషన్. ఒక 3 గంటలు సినిమాతో ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే సినిమా హిట్ అయినట్టే.
అదే ఒక 3 గంటల సినిమాతో ఒక ప్రేక్షకుడు సినిమా చూసొచ్చాక చాలా సంవత్సరాలు తర్వాత కూడా అంతే కనెక్ట్ అయితే ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అయినట్టే. అలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని రెండు భాషల్లో రీమేక్ చేశారు. కానీ ఏ భాషల్లో కూడా ఒరిజినల్ సినిమాలో చూపించిన అంతా ఎమోషనల్ గా చూపించలేకపోయారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే రెండు సినిమాలు ట్రోల్ కూడా అయ్యాయి.
“కొన్ని సినిమాలు టచ్ చేయకపోవడమే మంచిది” అని మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర అయిన జెమినీ గణేషన్ అంటారు. అది నిజమే ఏమో అని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమా పేరు బెంగళూరు డేస్. మలయాళం సినిమాలు చూడడం మొదలు పెట్టిన కొత్తల్లో చాలా మంది చూసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. మలయాళంలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇది సినిమా కాదు. చాలా మందికి ఒక ఎమోషన్. దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్, నివిన్ పౌలీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి, అంజలి మీనన్ దర్శకత్వం వహించారు.
Ads
ఒక ముగ్గురు కజిన్స్ వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొనే సంఘటనలు అన్నీ కలిపి ఈ సినిమాలో చూపించారు. ఇంత సింపుల్ గా ఉన్న స్టోరీ లైన్ మాత్రం ఎమోషనల్ గా చాలా లోతుగా ఉంటుంది. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇంత పాపులర్ అయిన సినిమాని తమిళ్ లో బెంగళూరు నాట్కల్ పేరుతో రీమేక్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సమంత కూడా నటించారు.
కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో యారియాన్ 2 రీమేక్ చేశారు. ఈ సినిమాని చాలా మంది ట్రోల్ చేశారు. సాధారణంగానే ఏదైనా ఒక రీమేక్ సినిమాని బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ లో మార్చినప్పుడు చేసే మార్పులు చాలా కామెడీగా ఉంటాయి. ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ విషయాలని కూడా మార్చడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.
ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాని తెలుగులో నాని, సమంత, శర్వానంద్ లతో రీమేక్ చేద్దామని అనుకున్నారట. నాని ఈ సినిమా చేయలేకపోయారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెట్స్ మీదకి వెళ్లలేదు. ఒకవేళ వీళ్లు చేసి ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకునేవారో. కానీ ఏదైనా సరే ఒరిజినల్ సినిమాకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా అంటే అందుకే ఇప్పటికి కూడా చాలా మందికి ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది.
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పాపులర్ యాక్టర్ అయ్యారు..! ఎవరో గుర్తు పట్టారా..?