సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో పాటు బరిలోకి దిగనున్న చిత్రాలు ఇవే…

Ads

సంక్రాంతి అంటే ఇంట్లో చేసుకునే పండగ కంటే థియేటర్ల దగ్గర హడావిడి ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి నే ఫోకస్ చేసుకొని బరిలోకి దిగుతాయి. హాలిడే కలెక్షన్ భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి అనేది ప్రొడ్యూసర్ల నమ్మకం. దీనికి తగినట్టుగానే సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో ఏదో ఒకటి సెన్సేషన్ అయితే సృష్టిస్తుంది.

2023 సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య మరియు వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేశాయి. ఈ నేపథ్యంలో 2024 సంక్రాంతికి సందడి చేయడానికి స్టార్ హీరోలో సినిమాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి సంక్రాంతి బరిలో సై అంటే సై అంటున్న ఆ చిత్రాలు ఏమిటో ఓ లుక్ వేదామా…

1 ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా నాగస్వరం డైరెక్షన్లో ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టుకే సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది.

2ఎస్ఎస్ఏమ్‌బీ 28

మహేష్ త్రివిక్రమ్ కిరేజి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఫామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి సై అంటుంది.

Ads

3. ఆర్‌సి 15

స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న రాంచరణ్ 15వ చిత్రం సంక్రాంతి సీజన్కు విడుదల అయ్యే అవకాశం ఉంది.

4. ఇండియన్ 2

కమల్ హాసన్ మరియు శంకర్ డైరెక్షన్లో వస్తున్న భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

5. ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సంక్రాంతి మార్కెట్ను పూర్తిగా వాడుకోవడానికి సిద్ధపడుతోంది. అయితే ఇంకా ఈ విషయంపై మూవీ మేకర్స్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

6. సూర్య 42

తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య ‘సూర్య 42 ‘ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సూర్య 16 వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Previous articleఇప్పటి సూపర్ స్టార్స్ సినీ ఇండస్ట్రీలో కి రాకముందు ఏమీ చేసేవారో తెలుసా?
Next articleమొదటిసారి రిలీజ్ కంటే కూడా రీ రిలీజ్ లో ఎక్కువ బిజినెస్ సాధించిన 7 సినిమాలు…