సచిన్ డైరీలో రాసుకున్న గొప్ప క్రికెటర్ విషాద గాధ..

Ads

సచిన్ టెండూల్కర్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ క్రికెట్ కు అంతర్జాతీయంగా వన్నె తీసుకొచ్చాడు. క్రికెట్ లో సచిన్ కొట్టేటువంటి షాట్లు ఇప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కావని చెప్పవచ్చు. ఆయన కొట్టే షాట్స్ కళాత్మకంగా ఉంటాయి.

Ads

సచిన్ బ్యాటింగ్ ప్రత్యేకమయిన శైలిలో ఉంటుంది. సచిన్ టెండూల్కర్ చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరు కూడా సచిన్ లా అవ్వాలని అనుకుంటారు. అయితే సచిన్ టెండూల్కర్ ను మించిన ఒక బ్యాట్స్ మెన్ ఉన్నాడని చాలామందికి తెలియదు. వెలుగులోకి రాని ఆ గొప్ప బ్యాట్స్ మెన్ నే సచిన్ టెండూల్కర్ స్ఫూర్తిగా తీసుకున్నారట. అయితే ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు వెలుగులోకి రాలేదో ఇప్పుడు చూద్దాం..
సచిన్ స్ఫూర్తిగా తీసుకున్న ఆ గొప్ప క్రికెటర్ పేరు అనిల్ గౌరవ్. ఆయన గురించి ఎవరు, ఎక్కడా చెప్పలేదు. స్వయంగా సచిన్ టెండూల్కర్ తన డైరీలో రాసుకున్నాడు. అయితే అనిల్ గౌరవ్ క్రికెట్ కు దూరం అయిన విషయాన్ని గురించి సచిన్ డైరీలో రాసింది చదివితే కన్నీళ్ళు రాక మానవు. అనిల్ గౌరవ్, వినోద్‌ కాంబ్లీ, సచిన్‌ టెండుల్కర్ క్రికెట్ లో సమకాలీకులు. వీరి గురువు రమాకాంత్ అచ్రేకర్. అయితే అచ్రేకర్ కు ప్రియ శిష్యుడు సచిన్ అని అందరు అనుకుంటారు. కానీ సచిన్ కన్నా బ్యాటింగ్ లో మెరుగైన అనిల్ కే ఆయన ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారు. అంతే కాకుండా అనిల్ బ్యాటింగ్ చేసే విధానాన్ని సచిన్, వినోద్ కాంబ్లీలకి చూపిస్తూ ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్పేవాడు.దాంతో సచిన్, కాంబ్లీ అనిల్ బ్యాటింగ్ ను చూస్తూ నేర్చుకునేవారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కి వెళ్తుంటే స్టేడియంలో ఎలా అయితే మారుమోగేదో అప్పట్లో అనిల్ గౌరవ్ బ్యాటింగ్ కు వెళ్తుంటే కూడా అనిల్ అనిల్ అని మారుమోగేది. ఇక అనిల్‌ గౌరవ్‌ కోచింగ్‌ సమయంలో అనిల్‌ తల్లి వచ్చినప్పుడు అచ్రేకర్‌ మీ కుమారుడు గొప్ప క్రికెటర్ అవుతాడు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ సచిన్‌ ఆటో బయోగ్రఫీలో రాసుకున్న విషయాలే. అయితే అంత అద్బుతమైన క్రికెటర్ అయిన అనిల్ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఒక స్లమ్ ఏరియాలో జీవిస్తున్నాడు. ఆయన మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసగా మారి, ఎంతో మంచి భవిష్యత్ ఉన్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు.
ప్రపంచ స్థాయిలో గొప్ప బ్యాట్స్ మెన్ గా ఉండాల్సిన అనిల్ గౌరవ్ కెరీర్ అలా అవడానికి కారణం ఆయన సోదరుడు అయిన అజిత్. ఆయన కారణంగానే అనిల్ కి క్రికెట్ పై ఇంట్రెస్ట్ పోయింది. తాను ఎంతగానో ప్రేమించిన క్రికెట్ కు దూరం అయ్యాడు. అనిల్ సోదరుడు అయిన అజిత్ క్రిమినల్. అతని పై హత్యారోపణలు కూడా ఉన్నాయి. ముంబైలో హత్య జరిగినప్పుడల్లా అజిత్ తప్పించుకొని పోయేవాడు. పోలీసులు అజిత్ కోసం అతని కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టేవారు. పోలిసుల వేధింపులు మరియు దెబ్బలకు తట్టుకోలేక అనిల్ మద్యంకు అలవాటు పడ్డాడు. అతను సిగరెట్ లేకపోతే పిచ్చి వాడిలా ప్రవర్తించేవాడు.
సిగరెట్ కు డబ్బులు లేకపోతే రోడ్డుమీద తాగి పడేసిన సిగరెట్ ను ఏరుకుని తాగేవాడు. ఇక వీటన్నిటికీ అతని సోదరుడు అజితే కారణం. ఆ క్రమంలో అనిల్ గౌరవ్ కు క్రికెట్ పై ఇంట్రెస్ట్ తగ్గుతూ పోయింది. చివరికి అనిల్ వీధుల్లో రూపాయి, రెండు రూపాయల కోసం పిల్లలతో బెట్టింగ్‌ చేసి, క్రికెట్‌ ఆడే స్థాయికి దిగజారాడు. గొప్ప టాలెంటె ఉన్న అనిల్ ను అలా చూడలేక గురువు అచ్రేకర్‌ అడిగితే, అంతర్జాతీయ మ్యాచ్‌ల కన్నా గల్లీలో ఆడే ఆటలోనే కిక్కు ఉందని అన్నాడంట. ఇక వీటన్నింటిని సచిన్ టెండూల్కర్ తన డైరీలో రాసుకొచ్చాడు.
Also Read: రిటైర్ అయ్యాక క్రికెటర్లు ఏం చేస్తారు..? ఈ 4 క్రికెటర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?

Previous articleహీరో రిషబ్ శెట్టి భార్య కాంతార సినిమా కోసం ఏం చేసిందో తెలుసా?
Next article”జల్సా” సినిమా క్రియేట్ చేసిన రికార్డు ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.