”జల్సా” సినిమా క్రియేట్ చేసిన రికార్డు ఏమిటో తెలుసా..?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించి క్రేజ్ ని కూడా విపరీతంగా సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా మీకు గుర్తుందా..? 2008లో జల్సా సినిమా విడుదల అయింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సంజయ్ సాహు పాత్ర లో పవన్ కళ్యాణ్ జీవించేశారు. యాక్షన్ కామెడీ సినిమాగ ఈ సినిమా తెర మీదకి వచ్చింది.

గీత ఆర్ట్స్ బ్యానర్ కింద అల్లు అరవింద్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా చాలా మంది వింటూ ఉంటారు. జల్సా సాంగ్, మై హార్ట్ ఈజ్ బీటింగ్, చలోరే చలోరే ఇలా ప్రతి సాంగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2008 లో ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పాటలు అందరికీ తెగ నచ్చేసాయి. ఎక్కువగా వినేవారు కూడా.

Ads

ఒక కొత్త రికార్డు ని ఈ సాంగ్స్ సృష్టించాయని చెప్పొచ్చు. ఇంతకీ పాటలు క్రియేట్ చేసిన రికార్డు ఏంటి అనేది చూస్తే… ఈ సినిమా పాటల రింగ్ టోన్స్ కోటి 40 లక్షలని కలెక్ట్ చేయడం జరిగింది. 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ 90 లక్షలకి కొనడం జరిగింది. ఇది కూడా రికార్డ్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా కథ ని బంగారం సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు.

Previous articleసచిన్ డైరీలో రాసుకున్న గొప్ప క్రికెటర్ విషాద గాధ..
Next articleఎం ఎస్ నారాయణ కొడుకు ఇంత అవమానాన్ని ఎదుర్కొన్నారా..? అవకాశం కోసం అడిగితే…!