Ads
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంత మంది అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్లుగా మారలేకపోయారు. హీరోయిన్ కావాలని ఇండ్రస్టీకి వచ్చి, హీరోయిన్లు కాలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా లేదా ప్రత్యేక పాటల వరకే పరిమితం అయిపోయిన నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.
వచ్చిన ఛాన్స్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో కొంతమంది సినీ తారలు స్పెషల్ సాంగ్స్ లో నటించి, పాపులారిటీతో పాటూగా వరుస ఆఫర్స్ పొందుతూ నాలుగురాళ్లు సంపాదించు కుంటున్నారు. అలాంటి వారిలో ముంతాజ్ ఒకరు. ముంతాజ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ చిత్రంలో ‘హోలీ హొలీ’ పాటలో చేసిన బ్యూటీ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆ సాంగ్ లో నటించి అప్పటి కుర్రాళ్ల గుండెల్లో హిట్ పుట్టించింది ముంతాజ్. తెలుగు, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో స్టార్ హీరోల, యంగ్ హీరోల పక్కన పాటలలో నటించింది. ఆమె మత్తెక్కించే చూపులతో యువత హృదయాల్ని దోచుకుంది.
ముంబై లో జన్మించిన ముంతాజ్, అక్కడే పెరిగింది. ఆమెకు సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 1999లో వచ్చిన “మోనిష ఎన్ మోనాలీసా” అనే కోలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమాలో నటించిన ముంతాజ్ అందచందాలకి ఫ్లాట్ అయిన సినీ మేకర్స్ ఆమెకు ఎక్కువగా బోల్డ్, వ్యాంప్ లాంటి క్యారెక్టర్స్ లో నటించే ఛాన్స్ లు ఇచ్చేవారు.
ఆ సమయంలో మొహమాటానికి పోయి ముంతాజ్ చేసిన ఈ క్యారెక్టర్స్ ఆమె సినిమా కెరీర్ ను నిర్ణయించాయి. దీంతో ఆమెకు ఎక్కువగా రెండవ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ అవకాశాలే వచ్చాయి. దాంతో ఆమె చేసేదేమీ లేక అలాంటి పాత్రలలోనే నటిస్తూ వచ్చింది. అయితే ముంతాజ్ నటించడమే కాకుండా కొన్ని సినిమాలకి సహ నిర్మాతగా ఉన్నారు. అయితే అక్కడ కూడా ముంతాజ్ కి నిరాశే ఎదురైంది.
చాలా కాలం తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ మూవీ ‘అత్తారింటికి దారేది’ లో స్పెషల్ సాంగ్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. అయితే ఆమె కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇటీవల ముంతాజ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది. అయితే ఆమె వివాహం చేసుకున్నట్టు, పిల్లలు ఉన్నట్టు ఆ ఫోటోలు చూస్తే తెలుస్తోంది. సోషల్ మీడియాలో ముంతాజ్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read: రూ.2.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హలో బ్రదర్’ సినిమా.. ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే, మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
View this post on Instagram
Ads
View this post on Instagram
View this post on Instagram