పవన్ కళ్యాణ్ చెల్లెలిగా తొలిప్రేమ సినిమాలో నటించిన వాసుకి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Ads

నటి వాసుకి గురించి ఇపుడున్న ఆడియెన్స్ కి పెద్దగా తెలీయకపోవచ్చు. కానీ తొలిప్రేమ మూవీలో పవన్ కల్యాణ్ చెల్లెలుగా నటించిన బుజ్జి అంటే మాత్రం గుర్తుపడతారు. ఆ సినిమా పవర్ స్టార్ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ హిట్ గా నిలిచింది. తొలిప్రేమ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో తన నటనతో వాసుకి అందరిని ఆకట్టుకుంది.

తొలిప్రేమ సినిమాలో పవన్‌ కళ్యాణ్ – వాసుకీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తే, కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టుకునేలా చేస్తాయి. ముఖ్యంగా సినిమా చివర్లో వాసుకి తనకు ఇష్టం లేకున్నా కూడా తనని ఎంతగానో ప్రేమించే అతన్ని వివాహం చేసుకుంటుంది. ఆ సందర్భంలో వాసుకి పవన్‌ కళ్యాణ్ తో చెప్పే మాటలు అందరి మనసుల్లోనూ నిలిచి పోయాయి. ఆ డైలాగ్స్ ప్రేక్షకులను భావొద్వేగానికి లోనయ్యేలా చేస్తాయి.
ఆ విధంగా ఆడియెన్స్ మనసుల్లో నిలిచిన వాసుకీ ఆ తరువాత మళ్ళీ ఏ చిత్రంలోనూ నటించలేదు. అలా ఒక్క చిత్రానికే పరిమితమైంది. తొలిప్రేమ షూటింగ్ సమయంలోనే ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అయిన పవన్‌ కల్యాణ్‌ స్నేహితుడు ఆనంద్ సాయితో వాసుకికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు పెళ్ళి చేసుకున్నరు. వాసుకి పెళ్లి తర్వాత సినిమాలకి, ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం వాసుకీ, ఆనంద్‌ సాయి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు కుమారుడు, ఒకరు కుమార్తె. వాసుకి ఐటీ కంపెనీ గూగుల్‌లో జాబ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లలను చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పిల్లలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అదే విధంగా టూర్‌, వెకేషన్‌ కు వెళ్ళినప్పటి ఫోటోలను కూడా తన అకౌంట్ లో షేర్‌ చేస్తుంటుంది.
ఇక వాసుకి భర్త ఆనంద్ సాయి తొలి ప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్ కు పనిచేసినప్పటి నుండి పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, ఖుషీ, జల్సా వంటి పవన్ చిత్రాలకు ఆర్డ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా తెలంగాణ తిరుమలగా పేరు పొందిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో ఆనంద్ సాయి తనదైన పాత్రను పోషించారు.

Ads

Also Read: హీరోయిన్ మీనా త‌ల్లి కూడా ఒకప్పడు టాప్ హీరోయిన్‌ అని తెలుసా?

 

View this post on Instagram

 

A post shared by Vasuki Anand (@vasukianand)

Previous articleపవన్ కళ్యాణ్‌ హీరోయిన్ ‘ముంతాజ్’ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
Next article”తొలిప్రేమ” మొదలు ”లవ్ టుడే” దాకా.. నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించిన 7 సినిమాలు ఇవే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.