మొదటి రోజు జరిగిన ఆ తప్పే.. తారకరత్న ప్రాణాలు పోవడానికి కారణం అయ్యిందా?

Ads

నందమూరి తారకరత్న మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. తారకరత్న గత ఇరవై మూడు రోజులుగా బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో శనివారం(18 ఫిబ్రవరి) రాత్రి కన్నుమూశారు.

Ads

తారకరత్న జనవరి 27వ తేదీన నారా లోకేష్ మొదలు పెట్టిన యువగళంలో పాల్గొన్నాడు. అదే రోజు పాదయాత్రలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తారకరత్నని వెంటనే చిత్తూరులోని హాస్పటల్ కి, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
ఆ రోజు నుండి కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. తారకరత్న హాస్పిటల్ లో చేరిన రోజు నుండి మరణించే వరకు కూడా తారకరత్నహెల్త్ కండిషన్ మెరుగు పరచడానికి వైద్యులు అహర్నిశలు ప్రయత్నించారు. అది మాత్రమే కాకుండా తారకరత్నకు వైద్యం చేయడం కోసం విదేశాల నుండి కూడా స్పెషలిస్ట్ లను పిలిపించారు. విదేశీ డాక్టర్ల రాకతో నందమూరి అభిమానులలో తారకరత్న క్షేమంగా తిరిగివస్తాడనే ఆశలు చిగురించాయి.
కానీ శనివారం రాత్రి తారకరత్న మరణ వార్త తెలియడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తారకరత్న ఇక లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా, ఇరవై మూడు రోజుల పాటు డాక్టర్లు అహర్నిశలు ప్రయత్నించినప్పటికి తారకరత్నని కాపాడలేకపోవడానికి ఫస్ట్ రోజు జరిగిన తప్పు వల్లేనా? అని అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి సీపీఆర్ నిమిషాల్లోనే చేయాలి. అయితే తారకరత్నకి సీపీఆర్ చేయడానికి సుమారు నలబై ఐదు నిమిషాలు ఆలస్యం జరిగింది. అంటే తారకరత్నకి సీపీఆర్ అందాల్సిన సమయంలో కాకుండా ఆలస్యంగా చేశారు. అందువల్ల గుండె రంధ్రాలలో రక్తం గడ్డ కట్టి, మెడదుకి రక్త సరఫరా ఆగిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తారకరత్నకు సరి అయిన సమయంలో సీపీఆర్ చేసి ఉన్నట్లయితే ఆయన పరిస్థితి మొదటి నుండి ఇంత విషమంగా ఉండేది కాదేమో. తారకరత్నకి మెరుగైన చికిత్స అందిచడానికి వైద్యులకి మరిన్ని అవకాశాలు ఉండేది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ రోజు జరిగిన ఆ తప్పు కారణంగానే తారకరత్న పరిస్థితి విషమంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ”నందమూరి తారకరత్న” అలేఖ్య ప్రేమ కథ విన్నారా..? ఇంత జరిగిందా..?

Previous articleసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రాన్ని ఆ టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సిందా?
Next articleఅల్లు అర్జున్ ”అల వైకుంఠ‌పుర‌ములో” చిత్రంలో కనిపించిన ఇంటి ధర ఎంతో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.