Ads
మనం హైవే మీద ఎక్కువ దూరం వెళ్లాలంటే దారిలో మనకి టోల్ గేట్స్ కనపడుతూ ఉంటాయి. టోల్ గేట్ల దగ్గర మనం డబ్బులు కట్టి వెళ్తూ ఉంటాము. ఇది వరకు అయితే టోల్ గేట్ ల దగ్గర ఎక్కువ సమయం పట్టేది. కానీ ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత ఫాస్ట్ గానే మనం వెళ్ళిపోతున్నాము. ఇవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతున్నాయి.
దానితో త్వరగానే మనం అక్కడ ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. టోల్ గేట్ ల దగ్గర ఫాస్టాగ్ లు రాకముందు ఎక్కువ సమయం పట్టేది.
అయితే టోల్ గేట్ దగ్గర ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాలి. ఈ విషయం మన కి తెలుసు. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి వంటి కొందరు ప్రముఖుల తప్ప మిగిలిన వారంతా కూడా టోల్ టాక్స్ ని కట్టవలసిందే. ప్రజల రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామి తో నిర్మించిన లేదా నిర్మించబోతున్న జాతీయ రహదారుల పై టోల్ టాక్స్ ని కట్టవలసిందే. అయితే టోల్ ట్యాక్స్ ని కట్టకుండా వెళ్లేందుకు మనకి కూడా మినహాయింపు ఉంది అది కూడా అన్ని సార్లు కాదు కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే. మరి దాని కోసమే ఇప్పుడు తెలుసుకుందాం.
Ads
టోల్ గేట్ నుండి 200 మీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే మనం టోల్ కట్టకుండా గేట్ దాటి వెళ్లొచ్చు. అలానే టోల్ గేట్ కి కొంచెం దూరంలో పసుపు రంగు లైన్ కనబడుతుంది. ఆ లైన్ అవతల ఎవరైనా సరే ఐదు నిమిషాలు కానీ అంతకంటే ఎక్కువ సేపు కానీ ఉంటే టోల్ కట్టక్కర్లేదు. గేట్ దాటి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కనుక ఈ సందర్భం ఎదురైతే ఈ రూల్ చెప్పి మీరు లైన్ దాటి వెళ్లిపోవచ్చు. కాబట్టి ఈ రెండు రూల్స్ ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఈ సారి టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.