పిల్లల్ని ఇలా గాలి లోకి ఎగరవేసి పట్టుకుంటున్నారు..? ఎన్ని సమస్యలో చూస్తే…మళ్ళీ ఇలా చెయ్యరు..!

Ads

చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని గాల్లోకి ఎగరవేసి పట్టుకుంటూ ఉంటారు. సినిమాలలోనే కాదు ఈ మధ్య చాలా వీడియోలు వస్తున్నాయి. పిల్లలని గాల్లోకి ఎగరవేసి వాళ్లని పట్టుకుంటూ ఉంటారు. పిల్లలు నవ్వుతున్నారు… సరదాగా ఉంటున్నారని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పిల్లలని గాల్లోకి ఎగరవేసి పట్టుకోకూడదు.

మీరు కూడా రెగ్యులర్ గా ఇలా చేస్తున్నట్లయితే దీన్ని తప్పక చూడండి. ఇక నుండి ఆ తప్పుని అసలు మీరు చెయ్యరు. చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంటుంది.

వాళ్ళని పదే పదే నవ్వించాలని మనం అనుకుంటూ ఉంటాం. ఒక సారి పిల్లల్ని గాలిలోకి ఎగరవేసి ఆ తర్వాత వాళ్ళని పట్టుకుంటూ ఉంటే వాళ్ళు భలేగా నవ్వుతూ ఉంటారు. పాపం చిన్నారులకి ఏమీ తెలీదు. ఏదో ఆటలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇలా ఆడటం వలన పిల్లలకే కాదు పెద్దలకి కూడా తల తిరుగుతుంది. కొంతమందికి అయితే ఇలా చేస్తే అస్సలు పడదు. వాంతులు కూడా అయిపోతూ ఉంటాయి. ఇక చిన్నారి పరిస్థితి ఎలా ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి.

Ads

ఇలా పిల్లల్ని గాలి లోకి ఎగరవేసి పట్టుకునే క్రమంలో వాళ్ళ మెదడుకి షాక్ తగిలే అవకాశం కూడా ఉంటుంది. పైగా చిన్నారులు మెదడు అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో ఎదగదు. మెదడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ కారణం గా బ్రెయిన్ షాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో మెదడులో రక్తస్రావం అయ్యి మెదడు వెన్నముకి నష్టం కలుగుతుంది. బ్రెయిన్ షాక్ వచ్చినా కూడా చిన్నారులు స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. ఆ పరిస్థితుల్లో పిల్లలు మాట్లాడలేరు. నడవలేరు. చూడలేరు. కొంత మంది పిల్లలు ప్రాణాలను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల అవయవాలు కూడా ఎదగవుట. కాబట్టి అస్సలు పిల్లల్ని ఇలా గాలిలోకి ఎగరవేసి పట్టుకోకండి. ఇది పిల్లలకి చాలా ప్రమాదం.

Previous articleఏటీఎం పిన్ కి ఎందుకు ”4” డిజిట్స్ ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?
Next articleఈ 2 సందర్భాల్లో ”టోల్ గేట్” దగ్గర డబ్బులు కట్టక్కర్లేదు… ఎప్పుడు అంటే..?