Ads
ఒకప్పుడు తెలుగు సిని పరిశ్రమని మిగతా సినీ రంగం వారు చిన్న చూపు చూసేవారు. అయితే అలాంటి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. రాజమౌళి ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టాడో కానీ, దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగాను అందరి చూపు టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడిందని చెప్పవచ్చు.
Ads
భారీ బడ్జెట్ తో బాహుబలి సినిమాను అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. అయితే అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాను ఎన్టీ రామరావుగారు తీసారట. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా బాలకృష్ణ కూడా నటించారు. కానీ ఆ చిత్రం రిలీజ్ కాలేదు. మరి ఆ సినిమా విడుదల కాకపోవడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సిని పరిశ్రమలో కొన్ని సినిమాలు ప్రకటించిన తరువాత ఆగిపోతే, మరికొన్ని సినిమాలు సగం షూటింగ్ అయిన తరువాత ఆగిపోతుంటాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి అయిన తరువాత కొన్ని కారణాల వల్ల నిలిచిపోతాయి. అయితే ఎన్టీ రామరావుగారు అప్పట్లోనే బాహుబలి లాంటి చిత్రాన్ని ప్రకటించి, చిత్రీకరణ మొదలు పెట్టారంట. కొంత సినిమా షూటింగ్ అయిన తరువాత ఆ మూవీ ఆగిపోయింది. ఆ సినిమా పేరు కంచు కాగడ. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ఈ సినిమాని బాలకృష్ణతో ఒక భారీ జానపద సినిమా చేయాలని అనుకున్నారట.
అయితే సినిమా ఆలస్యం అవడంతో ఆ విరామంలో ఇంకో కథను రాసి కంచుకోట అనే చిత్రాన్ని నిర్మించారట. ఈ సినిమాకి కేఎస్ రావు దర్శకత్వం చేయగా, ఇందులో బాలకృష్ణ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ మూవీలో సావిత్రి, దేవిక హీరోయిన్లుగా చేశారు. అప్పట్లోనే ఈ చిత్రానికి ఏడు లక్షల బడ్జెట్ పెట్టాడం విశేషం. ఈ మూవీ 30 సెంటర్లలో రిలీజ్ అయ్యి కేవలం ఏడు రోజుల్లోనే సినిమాకి పెట్టిన ఏడు లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, బాలకృష్ణతో కంచు కాగడా చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమాకి విశ్వేశ్వరరావు నిర్మాత. ఇది కూడా జానపద సినిమాగానే తెరకెక్కాల్సింది. ఇందులో హీరోయిన్ గా జమునను తీసుకున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలతో కొంత షూటింగ్ పూర్తి అయింది. ఆ తరువాత జమున గర్భవతి కావడంతో, ఆమె ప్రసవమయ్యాక మిగతా షూటింగ్ చేద్దామని అనుకున్నారు. దానికి ఎన్టీఆర్ కూడా సరే అన్నారు. అయితే ఆ తరువాత ఈ సినిమాలో కీలకపాత్రలో నటించే బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ చిత్రం ఆగిపోయింది. అయితే అప్పట్లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో బాహుబలి రేంజ్ లో తీయాలని అనుకున్నారట మూవీ యూనిట్.
Also Read: ఈ 6 విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?